తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థాంక్యూ డియర్. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలో కనిపిస్తూ వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలకపాత్రలు ఈ చిత్రంలో పోషించనున్నారు. సుభాష్ ఆనంద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా పి ఎల్ కే రెడ్డి డిఓపిగా పనిచేశారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేయడం జరిగింది. కాగా నేడు ఈ చిత్రంలోని తొలి గీతం ‘చిక్కక చిక్కిన గుమ్మ’ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదగా లాంచ్ చేయడం జరిగింది. ఈ పాటను నిర్మాత బాలాజీ రెడ్డి స్వయంగా రాయగ శ్రీచరణ్ ఈ పాటకు తన స్వరాన్ని జోడించారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ… “ఈరోజు థాంక్యూ డియర్ చిత్రం నుండి నా ద్వారా తొలి పాటను విడుదల చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. తమ్ముడు ధనుష్ రఘుముద్రికి ఆల్ ద బెస్ట్. నాన్నగారి దగ్గర నుండి మీ కుటుంబం మాకు ఎంతో సన్నిహితులు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఇతర చిత్ర బంధం అందరికీ ఆల్ ద బెస్ట్. థాంక్యూ డియర్ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ… “మా థాంక్యూ డియర్ సినిమాలోని తొలి పాట చిక్కక చిక్కిన గుమ్మ పాటను రాకింగ్ స్టార్ మనోజ్ గారు లాంచ్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆయనకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత బాలాజి రెడ్డి మాట్లాడుతూ… “మంచు మనోజ్ గారి చేతుల మీదుగా మా చిత్రం థాంక్యూ డియర్ నుండి పాట విడుదల చేయడం జరిగింది. మాకు సపోర్టు చేసినందుకుగాను మనోజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమా కూడా మంచి హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను” అన్నారు.
సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ… “నేడు మా థాంక్యూ డియర్ సినిమా నుండి చిక్కక చిక్కిన గుమ్మ పాటను మంచు మనోజ్ గారు విడుదల చేశారు. పాటను వింటూ మనోజ్ గారు బాగా ఎంజాయ్ చేశారు. మనోజ్ గారికి పర్సనల్ గా ఈ పాట బాగా కనెక్ట్ అయింది. ఈ పాట సక్సెస్ అవ్వాలని చిత్ర బృందం అంతా కోరుకుంటున్నాము” అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ పునీత్ మాట్లాడుతూ… “ఈరోజు థాంక్యూ డియర్ నుండి రాకింగ్ స్టార్ మనోజ్ గారు పాటను విడుదల చేయడం జరిగింది. ఆయన పాటకు బాగా కనెక్ట్ అయ్యారు. పాటను అలాగే సినిమాను ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.
నటి నటులు – హెబా పటేల్ , ధనుష్ రఘుముద్రి , రేఖ నిరోషా, వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు.
బ్యానర్ : మహా లక్ష్మి ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ : పప్పు బాలాజీ రెడ్డి
రైటర్ & డైరెక్టర్ – తోట శ్రీకాంత్ కుమార్
ఎడిటర్ : రాఘవేంద్ర పెబ్బేటి
మ్యూజిక్ – సుభాష్ ఆనంద్
డి ఓ పి : పి ఎల్ కె రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ – బలిజ పునీత్ రాయల్
కో ప్రొడ్యూసర్ – పి బి వి వి సత్య నారాయణ
కస్టమ్ డిజినర్ – భావన పోలిపల్లి
పి ఆర్ ఓ – మధు వి ఆర్
డిజిటల్ – డిజిటల్ దుకాణం