విడాకుల వార్తలపై స్పందించిన మంచు మనోజ్

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు చిన్న తనయుడు మూడేళ్ళ క్రితం ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి మనోజ్ లైఫ్ లో విజయం దూరమైందని, అలాగే వ్యక్తిగత జీవితంలోను ఆనందం కరువైందని.. అందుకే ప్రణతికి విడాకులు ఇవ్వడానికి సిద్ధమయినట్లు కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమన్నాయి. ఈమేరకు ఇటీవల అమెరికాలో చిన్న సెటిల్ మెంట్ కూడా జరిగిందని పుకార్లు షికారు చేశారు. అప్పట్నుంచి మనోజ్ చాలా డిస్టర్బ్ గా ఉంటున్నాడని, అందుకే కొత్త సినిమా కూడా ఏదీ మొదలెట్టలేదని.. ఆ డిస్ట్రబ్ తోనే మొన్న పబ్ లో రచ్చ చేసాడని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టింది. వీటన్నింటిపై మంచు మనోజ్ స్పందించారు. విడాకుల వార్తలు అబద్ధమని చాటుతూ..

తన భార్య ప్రణతి తో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోని షేర్ చేశారు. అయినా విడాకుల వార్తలు ఆగకపోవడంతో ట్విట్టర్ వేదికపై అభిమానులతో మాట్లాడారు. తనపై వస్తున్న రూమర్లలో వాస్తవం లేదని ఖండించారు. మరి సినిమాలు ఎందుకు చేయడం లేదని అడగగా.. కథలు వింటున్నానని.. త్వరలోనే ఓ ప్రేమ కథతో ముందుకు రాబోతున్నట్టు స్పష్టం చేశారు. డైరక్టర్, నిర్మాత వివరాలను త్వరలోనే చెబుతానన్నారు. మంచు మనోజ్ నటించిన గత చిత్రాలు శౌర్య, అటాక్, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు వంటివి ఆశించినంతగా విజయం సాధించలేదు. ప్రేమ కథతోనైనా మనోజ్ హిట్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus