Manchu Manoj: ఆ వ్యక్తిపై సెటైర్లు వేసిన మంచు మనోజ్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించి మంచు విష్ణు అధ్యక్షునిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలామంది ప్రకాష్ రాజ్ గెలుస్తారని భావించినా అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. మంచు విష్ణు మేనిఫెస్టో నచ్చడం వల్లే ఎక్కువమంది ఆయనకు ఓట్లు వేసి గెలిపించారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత మంచు విష్ణును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. కొందరు సినీ ప్రముఖులు సైతం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విష్ణుకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు.

Click Here To Watch NEW Trailer

తాజాగా ఒక సందర్భంలో మంచు మనోజ్ మాట్లాడుతూ మనందరికీ హయ్యర్ పర్పస్ అనేది ముఖ్యమని తెలిపారు. మొన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయని ఎన్నికల్లో జనాలు విష్ణును గెలిపించారని మనోజ్ చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి మాత్రం మా అన్న విష్ణును టార్గెట్ చేశారని మనోజ్ తెలిపారు. ఆ వ్యక్తి టార్గెట్ చేసినా అన్న కానీ నాన్నగారు కానీ పట్టించుకోలేదని మనోజ్ వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాకు మద్దతు ఇచ్చిన వాళ్లను కూడా టార్గెట్ చేసిన వ్యక్తి బూతులు తిట్టాడని మనోజ్ పేర్కొన్నారు.

వాళ్లెందుకు అలా చేశారని నేను ఆలోచించానని వాళ్లకు హయ్యర్ పర్పస్ లేదని నాన్న తనకు చెప్పారని మనోజ్ చెప్పుకొచ్చారు. నాన్న చెప్పింది కరెక్టే కదా అని అనిపించిందని మనోజ్ కామెంట్లు చేశారు. అన్నను టార్గెట్ చేసిన వ్యక్తి చుట్టూ జనాలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు ఉన్నారని మనోజ్ తెలిపారు. ఆయనకు మాత్రం ఏదీ లేదని మనోజ్ సెటైర్లు వేశారు. ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చిన ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తిపై మనోజ్ ఈ కామెంట్లు చేశారు.

నాన్న ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారని మనోజ్ వెల్లడించారు. నాన్నను చూసి నేను గర్వపడుతున్నానని మనోజ్ వెల్లడించారు. హయ్యర్ పర్పస్ ను ఎప్పటికీ మరిచిపోవద్దని మనం పది మందికి ఉపయోగపడాలని మంచు మనోజ్ వెల్లడించారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus