‘కన్నప్ప’ (Kannappa) సినిమాకి పెద్ద బలం ప్రభాస్ (Prabhas) స్టార్ డమ్. ఈ సినిమాలో అతను కీలక పాత్ర పోషించాడు. అతను పాన్ ఇండియా స్టార్. కాబట్టి.. వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. మోహన్ బాబు (Mohan Babu) పై ఉన్న అభిమానంతో ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా ప్రభాస్ (Prabhas) నటించాడు. బాగానే ఉంది. మరి మోహన్ బాబు (Mohan Babu) ప్రాణ స్నేహితుడు రజినీకాంత్ ఈ సినిమాలో ఎందుకు నటించలేదు.
ఆయన ‘కన్నప్ప’ (Kannappa) లో నటించడానికి ఇష్టపడలేదా? లేక మోహన్ బాబు (Mohan Babu), విష్ణు (Manchu Vishnu) ‘కన్నప్ప’ కోసం రజినీకాంత్ (Rajinikanth) ని సంప్రదించలేదా? చాలా మంది మైండ్లో ఈ ప్రశ్న ఉంది. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించి క్లారిటీ ఇచ్చాడు. మంచు విష్ణు ఈ విషయం పై మాట్లాడుతూ… “నేను ప్రభాస్ ని ‘కన్నప్ప’ కోసం అనుకున్నప్పుడు ఒక నటుడిగానే కాకుండా అతని స్టార్ డమ్ కి కూడా న్యాయం చేసే క్యారెక్టర్ ఉందని భావించి సంప్రదించడం జరిగింది.
నేను ప్రభాస్ (Prabhas) ని సరిగ్గా చూపించకపోతే కోట్ల మంది ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతారు. అలాగే అక్షయ్ కుమార్ (Akshay Kumar) గారి విషయంలో కూడా అంతే. మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్ (Mohanlal) వంటి వారికి సరిపడే పాత్రలు ఇందులో ఉన్నాయి. పాత్రలు రాసుకుంటున్నప్పుడు వాళ్ళు మైండ్లోకి రావాలి.
కానీ రజినీకాంత్ గారికి సరిపడే పాత్ర నాకు తట్టలేదు ఈ సినిమాలో. ఆయన కోసం బలవంతంగా ఓ క్యారెక్టర్ రాస్తే అది ‘కన్నప్ప’ (Kannappa) కి న్యాయం చేసినట్టు అవ్వదు. ఈ ఈవెంట్ కి వచ్చేప్పుడు కూడా రజినీకాంత్ (Rajinikanth) గారితో మాట్లాడుతూనే వచ్చాను” అంటూ క్లారిటీ ఇచ్చారు.
రజనీకాంత్ గారికి సరిపోయే స్థాయి పాత్ర నేను కన్నప్పలో రాయలేకపోయా#Kannappa #VishnuManchu #MohanBabu #Prabhas #AkshayKumar #Mohanlal pic.twitter.com/8HWiIJmFDo
— Filmy Focus (@FilmyFocus) June 26, 2025