టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 13వ తేదీ ఈయన మా అధ్యక్షుడిగా అధికారం చేపట్టారు. ఈ క్రమంలోనే మా అధ్యక్షుడిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేయడమే కాకుండా మా సభ్యులకు తనదైన శైలిలో వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఈ క్రమంలోనే మంచు విష్ణు మాట్లాడుతూ గత ఏడాది మా ఎన్నికల సమయంలో ఇండస్ట్రీలో ఎంతో అలజడిని సృష్టించాయి. మా ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలను తలపించాయని తెలియజేశారు. నేను కేవలం మా అసోసియేషన్ కి మాత్రమే కాదు ప్రేక్షకులకి కూడా జవాబుదారినే అంటూ వెల్లడించారు. ఇక మా అసోసియేషన్ లో 20 మంది నటులు కాని వారు కూడా సభ్యత్వం పొందారు.ఇలా మా అసోసియేషన్ లో సభ్యత్వం పొందాలంటే కనీసం రెండు సినిమాలలో నటించి ఆ సినిమాలు విడుదలై ఉండాలి అలాగే సినిమాలలో ఐదు నిమిషాలు పాటు కనీసం డైలాగులు చెప్పి ఉండాలి అంటూ తెలిపారు.
అసోసియేట్ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదు. మా అసోసియేషన్ కి ఎవరైనా వ్యతిరేకంగా ధర్నాలు చేసిన మీడియా ఎదుటకు వెళ్లిన వారిపై చర్యలు తీసుకుంటామని వారికి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తామని ఈయన వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 90 శాతం పనులు పూర్తి అయ్యాయని ఈ సందర్భంగా మంచు విష్ణు వెల్లడించారు.
ఇకపోతే మా బిల్డింగు గురించి కూడా ప్రస్తావనకు తీసుకువచ్చి భవనం విషయంలో రెండు ప్రతిపాదనలను సూచించాము ఒకటి ఫిలింనగర్ కి అరగంట దూరంలో ఓ భవనాన్ని నిర్మించాలని భావించాము. అదేవిధంగా ఇప్పుడున్న భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మించాలని ప్లాన్ చేసాము ఇందుకు అవసరమయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని చెప్పారు. ఇలా రెండు ప్రతిపాదనలను అసోసియేషన్ సభ్యుల ముందు ఉంచగా అందరూ కూడా రెండవ ప్రతిపాదనకే మద్దతు తెలిపారని ఈ సందర్భంగా విష్ణు వెల్లడించారు.