మంచు కుటుంబంలో ఈమధ్య కాలంలో వరుసగా కొన్ని వివాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు (Mohan Babu) , విష్ణు (Manchu Vishnu) , మనోజ్ (Manchu Manoj) మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ గొడవలో టాపిక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంఘటన మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ ఇంట్లోని జనరేటర్ లో పంచదార పోసిన వ్యవహారం. ఈ విషయం పోలీసు కంప్లైంట్ వరకు వెళ్లగా, సోషల్ మీడియాలో కూడా తెగ చర్చనీయాంశంగా మారింది.
ఇదంతా ఒకవైపు ఉంటే, మంచు విష్ణు తాజాగా ‘Ask Vishnu’ అంటూ తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో అభిమానులతో చిట్‌చాట్ చేశారు. దీనిలో భాగంగా ఓ నెటిజన్ నేరుగా అడిగిన ప్రశ్న వైరల్ అయ్యింది. ‘మీరు నన్ను బ్లాక్ చేయకుండా, ప్రశ్నకు సమాధానం ఇస్తున్న మీ మంచి మనస్సు నచ్చింది. కానీ ఆ రోజు జెనరేటర్ లో షుగర్ ఎందుకు వేశావ్?’ అంటూ ప్రశ్నించగా, విష్ణు సూపర్ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చాడు.
“ఫ్యూయెల్ లో షుగర్ కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివా” అంటూ సరదాగా స్పందించాడు. విష్ణు ఈ వివాదాన్ని మరింత ముదరనివ్వకుండా చమత్కారంగా తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఇటువంటి ప్రశ్నలకు పెద్దగా స్పందించని విష్ణు, ఈసారి మాత్రం హాస్యంగా వ్యవహరించడంతో నెటిజన్లు తెగ రియాక్ట్ అవుతున్నారు. కొందరు ‘అసలు ఏం జరిగింది? నిజంగా విష్ణు పంచదార పోసారా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa) సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటులు మోహన్ లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar) , ప్రభాస్ (Prabhas) , కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 2025 ఏప్రిల్ 25న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విషయంలో విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.