సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి జనాలకు ఎప్పుడూ ఉంటుంది.. వాళ్లు నివసించే లగ్జరీ ఇళ్లు, కార్లు, కథానాయికల డ్రెస్సెస్, ఆర్నమెంట్స్ వంటి వాటికి సంబంధించి వార్తలు వచ్చినప్పుడల్లా వైరల్ అవుతుంటాయి.. బాలీవుడ్ హీరోయిన్ల గురించి అయితే ఇలాంటి న్యూస్ కోకొల్లలు.. హ్యాండ్ బ్యాగ్ దగ్గరినుంచి కాళ్లకి వేసుకునే శాండిల్స్ వరకు వాటి బ్రాండ్స్, కాస్ట్ వివరాలు తెలిసి ప్రేక్షకులు షాక్ అవుతుంటారు.. టాలీవుడ్ విషయానికొస్తే.. అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి, మహేష్ భార్య నమ్రత, రామ్ చరణ్ సతీమణి ఉపాసనల పర్సనల్ లైఫ్ గురించిన వార్తలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి..
వాళ్ల లివింగ్ స్టైల్, స్టార్ కిడ్స్ పిక్స్, వీడియోస్ వంటివి కూడా వైరల్ అవుతుంటాయి.. తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu) అర్థాంగి విరానికా మంచు డ్రెస్ గురించి ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.. సాధారణంగా ఆమె లైఫ్ స్టైల్ గురించి పెద్దగా బయటకి రాకపోయినా.. లగ్జరీ లైఫ్ స్టైల్ అని అంటుంటారు.. ఇప్పుడు చదవబోయే వివరాలు చూస్తే అది నిజమేనని మీరే ఒప్పుకుంటారు..మంచు విష్ణు, విరానికాలది ప్రేమ వివాహం.. వీరికి నలుగురు పిల్లలున్నారు..
ఫస్ట్ నుంచి ఫ్యాషన్ మీద విరానికాకు మంచి గ్రిప్, టేస్ట్ ఉంది.. ఇంట్లో అందరికీ తనే డిజైనర్.. ఇక ట్రెడిషనల్, మోడ్రన్ వేర్ ఏదైనా ఆమెకు సూట్ అయ్యేలా డిజైన్ చేయించుకుంటుంటారు.. ఇటీవల ఆమె మ్యాచ్ & మ్యాచ్ – హార్ట్ – ఎంబ్లిష్డ్ క్రాప్డ్ బ్లేజర్ & మినీ స్కర్ట్ వేసుకుని స్టైలిష్గా కనిపించారు.. ఆ డ్రెస్ కాస్ట్ అంత తక్కువేమీ కాదు..
864 యూరోస్ – 87,158/- రూపాయలు అని కనిపిస్తున్నా.. ఇంకా ఎక్కువ రేటే ఉంటుందని సమాచారం.. ‘కాస్ట్ సంగతి పక్కప పెడితే.. విరానికా స్టైలింగ్ సూపర్.. ఈ డ్రెస్ పర్ఫెక్ట్గా సూట్ అయింది.. ఎంతైనా స్టార్ హీరో వైఫ్ కదా’ అంటూ నెటిజన్స్, ప్యాషన్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు..