Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

విజయ్‌ సేతుపతి – సాయి పల్లవి – మణిరత్నం.. వీరిని కల్ట్‌ క్లాసిక్‌ కాంబో అని అనొచ్చు. గతంలో ఎప్పుడూ ఈ ముగ్గురూ కలసి పని చేయలేదు. ఎలా మరా కల్ట్‌ క్లాసిక్‌ కాంబో అంటారు అని అనుకుంటున్నారా? నిజమే ఈ ముగ్గురూ కలసి పని చేయలేదు. కానీ ఈ ముగ్గురి నేచర్‌ తెలిశాక ఎవరైనా ఇదే మాట అంటారు. మణిరత్నం దర్శకత్వం, విజయ్‌ సేతుపతి వైవిధ్యమైన సహజ నటన, సాయి పల్లవి స్క్రీన్‌ ప్రజెన్స్‌, నటనలోని సహజత్వం కలగలిపితే మేం పైన చెప్పిన కల్ట్‌ క్లాసిక్‌ కాంబో వచ్చేస్తుంది.

Maniratnam – Vijay Sethupathi

ఈ ముగ్గురు కలసి ఓ సినిమా చేయబోతున్నారు అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ఇటీవల సినిమా షూటింగ్‌ ప్రారంభించేశారు. కోల్‌కతాలోని రోడ్లపై సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్‌ సేతుపతి – సాయిపల్లవి ఓ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సీన్‌ ఒకటి తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆన్‌ సెట్‌ పిక్‌ ఇప్పుడు లీకైంది. సోషల్ మీడియాలో ఆ ఫొటో గురించే చర్చ నడుస్తోంది.

‘96’ సినిమాలో త్రిష పక్కన విజయ్‌ సేతుపతిని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్‌ కలిగిందో ఇప్పుడు కూడా కలుగుతోంది అనే చర్చ మొదలైంది. ఇక సాయిపల్లవిని చూసి ‘ఫిదా’ అయిపోతున్నారు ఫ్యాన్స్‌. అన్నట్లు ‘96’ సినిమా రోజులు అని ఎందుకున్నామంటే.. ఆ సినిమాలో సేతుపతి గడ్డం తీయించేస్తుంది త్రిష గుర్తుందా.. ఇప్పుడు అదే లుక్‌లో సినిమాలో కనిపించనున్నాడు. చాలా ఏళ్ల తర్వాత సేతుపతిని అలా చూడబోతున్నాం అన్నమాట.

ఇక మణిరత్నం విషయానికొస్తే 16 ఏళ్ల తర్వాత ఆయన కోల్‌కతా వచ్చారు. ‘రావణ్‌’ సినిమా కోసం ఆయన ఆఖరిసారిగా అక్కడకు వెళ్లారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు జరిగిందట. సినిమాలో ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్స్‌ షూట్‌ చేస్తున్నారని సమాచారం.

ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus