Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

దివంగత నటుడు శ్రీహరికి మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే అతను విలన్ గా చేసిన, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా, కమెడియన్ గా చేసినా, హీరోగా చేసినా ఆడియన్స్ ఆదరించారు. ముఖ్యంగా హీరోగా శ్రీహరి టర్న్ తీసుకున్నప్పుడు చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ మాస్ ఆడియన్స్ ఆదరించడంతో హీరోగా కూడా మార్కెట్ పొందగలిగారు శ్రీహరి. ఈ క్రమంలో చాలా మంది దర్శకనిర్మాతలకి లైఫ్ ఇవ్వగలిగారు శ్రీహరి.

Meghamsh Srihari

సరిగ్గా ఇలానే శ్రీహరి తనయుడు మేఘాంశ్..ని(Meghamsh Srihari) కూడా ఆదరిస్తారని అంతా అనుకున్నారు. కానీ మేఘాంశ్ డెబ్యూ మూవీ రాజ్ దూత్ నిరాశపరిచింది. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు.  కానీ అందులో కొన్ని షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. ఇంకొన్ని రిలీజ్ కి నోచుకోలేదు. దీంతో మేఘాంశ్ ఎగ్జిస్టెన్స్ పై అందరూ అనుమాన పడ్డారు. అయితే ఇప్పుడు అతను ‘ఆస్మాన్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

నిన్న ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుక జరిగింది. టీజర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది. అలాగే క్యూ అండ్ ఎ లో మేఘాంశ్ పాల్గొన్న తీరు కూడా అందరినీ మెప్పించింది. చాలా మెచ్యూర్డ్ గా ప్రతి ప్రశ్నకి జవాబిచ్చాడు మేఘాంశ్. ‘రాజ్ దూత్ సినిమా చేసినప్పుడు నేనో పిల్ల బచ్చాని..! తర్వాత వరుసగా సినిమాలు ఓకే చేశాను. కొన్ని మొహమాటం కొద్దీ ఓకే చేసేశాను. అయితే ఇప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చిందనుకుంటున్నాను.

ఎందుకంటే నో చెప్పడం నేర్చుకున్నాను. ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. మా నాన్నగారి పేరు చెడగొట్టకుండా సినిమాలు చేయాలని తీర్మానించుకున్నాను’ అంటూ మేఘాంశ్ చెప్పడం జరిగింది. మేఘాంశ్ లో ఈ మార్పు అభినందనీయం. ఏదో ఒక సినిమా చేసేసి క్యాష్ చేసుకోవాలనుకునే చాలా మంది యంగ్ హీరోలు కూడా ఇలాంటి ఆటిట్యూడ్ కలిగి ఉండాలి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus