మహేష్ మనస్తత్వం గురించి చెప్పిన మంజుల

  • February 8, 2018 / 11:37 AM IST

షో, కావ్యాస్ డైరీ సినిమాల ద్వారా సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల నటిగా నిరూపించుకున్నారు. అలాగే నిర్మాతగాను విజయం అందుకున్నారు. ఇప్పుడు ఆమె మెగా ఫోన్ అందుకున్నారు. సందీప్ కిషన్, త్రిధా చౌదరి, అమైరా దస్తూర్ లు హీరో హీరోయిన్లుగా “మనసుకు నచ్చింది” అనే సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన మంజుల తన తమ్ముడు మహేష్ బాబు గురించి అనేక సంగతులు వెల్లడించారు. “సినిమాల్లో కనిపించేలా మహేష్ నిజ జీవితంలో అంత ఓపెన్ గా ఉండడు. కుటుంబం మీద అభిమానం, ప్రేమను వ్యక్తం చేయడం రాకే గుండెల్లోనే దాచుకుంటాడు” అని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ “సైలెంట్ గా ఉండటం మహేష్ నైజం.

నా పుట్టిన రోజు నాడు కూడా మహేష్ ఫోన్ చేసి.. నేను ఏం చేయబోతున్నాను.. ప్లాన్స్ ఏంటి అనేది అడుగుతాడు. కానీ విష్ చేయటం మాత్రం మర్చిపోతాడు.” అని మహేష్ మనస్తత్వాన్ని బయటపెట్టారు. మహేష్ తీరుపై అమ్మ(ఇందిర) మాటకు కూడా వివరించారు. “ఇదే మాట అమ్మ కూడా చెబుతూ వాడికి ప్రేమించడం తెలుసు ప్రేమించినవాళ్ళను గుండెల్లో పెట్టుకోవడమూ తెలుసు తప్ప అది బయటికి చూపించాలని ఎప్పుడూ అనుకోడని చెప్పారు” అని మంజుల తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus