‘మన్మధుడు2’ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు..!

కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మధుడు2’. ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ‘వియాకామ్ మోషన్ పిక్చర్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేష్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఆగష్టు 9 న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఓ ‘ఫ్రెంచ్’ సినిమా ఆధారంగా రూపొందింది ‘మన్మధుడు2’ చిత్రం. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్లు, పాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

ఇక తాజాగా ‘మన్మధుడు2’ చిత్రానికి సంబందించి సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు ‘యూ/ఎ’ సర్టిఫికెట్ ను జారీ చేశారు. సినిమాలో కాస్త రొమాన్స్ డోస్ అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సిగరెట్ కాల్చే సన్నివేశాల కారణంగా పక్క ‘యూ’ మిస్సయింది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుందంట. ప్రేక్షకులకు కావాల్సిన ఫన్ అంతా ఫస్ట్ హాఫ్ లో ఉందని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ మొదట్లో … కాస్త సీరియస్ మోడ్ లోకి వెళ్తుందట. సెకండ్ హాఫ్ మొదటి 15 నిముషాలు కాస్త స్లోగా సాగుతుందనే.. ఫీలింగ్ వచ్చినా ఆ తరువాత మళ్ళీ ఎంటర్టైన్మెంట్ తో రన్ అవుతుందని సమాచారం. క్లయిమాక్స్ లో వచ్చే ఫ్యామిలీ ఎలెమెంట్స్ కూడా సహజంగా.. ఆకట్టుకునేలా ఉంటుందట. ఇక హైలెట్స్ విషయానికి వస్తే… నాగార్జున, వెన్నెల కిశోర్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ హైలెట్స్ లో ఒకటి కాగా… ఎం.సుకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ సెకండ్ హైలెట్ అని తెలుస్తుంది. చేతన్ భరద్వాజ్ అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలుస్తుందట. ‘చి ల సౌ’ చిత్రంతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్.. ఆ చిత్రాన్ని మించి ఈ చిత్రాన్ని మలిచాడట. ఇక రకుల్ బోల్డ్ పెర్ఫార్మన్స్ , అలాగే కమర్షియల్ ఎలెమెంట్స్ లోపించడం మాస్ ప్రేక్షకులకి కాస్త ఇబ్బందిగా ఉండడంతో వాటిని మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus