Manchu Manoj: మూడేళ్లుగా ఓ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న మనోజ్‌.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

‘భైరవం’ సినిమాతో హీరోగా రీఎంట్రీని స్ట్రాంగ్‌ ఇద్దామని ఫిక్స్‌ అయి భారీగా ప్రచారం చేసి మరీ థియేటర్లలో ఇబ్బంది పడ్డాడు మంచు మనోజ్‌. ఆ తర్వాత ‘మిరాయ్‌’ సినిమాలో బ్లాక్‌ స్వార్డ్‌గా వచ్చి విలన్‌గా ఊహించని విజయం అందుకున్నారు. సినిమాకు, ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అంతకుమిచిన ఓ కథతో సినిమా చేస్తున్నాడు. ‘డేవిడ్‌ రెడ్డి’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఇది కాకుండా రెండు సినిమాలు గతంలో ఆగిపోయాయి. అవి వస్తాయో లేదో తెలియదు కానీ.. ఓ సినిమా కోసం మూడేళ్లుగా పని చేస్తున్నాడు.

Manchu Manoj

అవును, మంచు మనోజ్‌ గత మూడేళ్లుగా ఓ సినిమా కోసం తన క్రియేటివిటీకి, ఆలోచనా శక్తికి పని చెబుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ఎవరూ ఊహించని స్థాయిలో అనౌన్స్‌మెంట్‌ ఇస్తాడట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మంచు మనోజ్‌. ఇప్పటికే నటన, డ్యాన్స్‌, ఫైట్స్‌, సింగర్‌, ప్రొడ్యూసర్‌ లాంటి పనులు చేస్తూ ఆల్‌రౌండర్‌గా టాలీవుడ్‌లో పేరు గాంచిన మంచు మనోజ్‌.. ఇప్పుడు సినిమా దర్శకుడిగా, మేకర్‌గా తన ప్రతిభను చూపించబోతున్నాడు. దీని కోసం ఓ యానిమేషన్‌ కథను సిద్ధం చేస్తున్నాడట.

యాక్షన్‌ బేస్డ్‌ యానిమినేషన్‌ సినిమా కోసం మూడేళ్లుగా పని చేస్తున్నానని, పనులు తుది దశకు చేరుకున్నాయి అయిన ఇటీవల ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే కథ ఎలా ఉంటుంది, ఎవరి మీద ఉంటుంది అని మాత్రం చెప్పలేదు. యానిమేషన్‌ కథ కాబట్టి.. ఆయనకు స్నేహం, పరిచయం ఉన్న స్టార్‌ హీరోలు, హీరోయిన్లతో వాయిస్‌ ఓవర్‌ ఇప్పిస్తాడు అని ఊహించొచ్చు. చూద్దాం మరి మనోజ్‌ మనసులో ఏముందో?

ఇక ‘డేవిడ్‌ రెడ్డి’ విషయానికొస్తే.. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. హనుమ రెడ్డి యక్కంటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1897–1922 మధ్య కాలాన్ని ఆధారంగా చేసుకున్న ఓ విప్లవ వీరుడి కథతో రాసుకున్నది. కుల వ్యవస్థ ఒత్తిడుల నుండి తిరగబడి, బ్రిటిష్ పాలనపై ఎదురుతిరిగిన ఓ రెబల్ జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ఇటీవల పోస్టర్‌ రిలీజ్‌ చేసి సినిమాను అనౌన్స్‌ చేసినప్పుడు టీమ్‌ చెప్పింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించే పాత్రలో మనోజ్ కనిపించనున్నాడు.

నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus