ఆసక్తి రేపుతున్న “మను” టీజర్

  • December 24, 2016 / 02:00 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విప్లవానికి 2017 సాక్షిగా నిలవనుంది. మాటలకే పరిమితమైన “క్రౌడ్ ఫండింగ్” మూవీ థియేటర్లోకి రానుంది. సినిమా పై అపరిమితమైన అభిమానం ఉన్న యువకులు కలిసి ఒక కళాఖండానికి రూపమిచ్చారు. సినీ ప్రేమికులు చందాలు వేసుకుని నిర్మించిన “మను” అనే చిత్రం టీజర్ ఈ రోజు (శనివారం) విడుదలై టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. క్రిస్మస్ కానుకగా యూట్యూబ్ లో రిలీజ్ అయిన  ఈ వీడియో మొదలు నుంచి చివరి వరకు సస్పెన్స్ తో సాగి సినీ ప్రముఖులను సైతం ఆకర్షించింది. థ్రిల్లరా? హారర్ మూవీనా ? అంటూ మళ్ళీ మళ్ళీ ఈ టీజర్ ని చూస్తున్నారు. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి  ప్రతి ఫ్రేమ్ ను క్రియేటివ్ గా కంపోజ్ చేసి తన ప్రతిభతో మరో మారు ఆకట్టుకున్నారు.

గతంలో ఆయన తీసిన “మధురం” అనే  షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టించింది. దీంతో దర్శకునికి టాలీవుడ్ యువ హీరోల నుంచి అవకాశాలు కూడా వచ్చాయి. కానీ జీరో బడ్జెట్ మూవీ తీయాలనే తన కలను నిజం చేసుకోవాలని భారీ ఆఫర్లను పక్కన పెట్టి ఫణీంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందుకు కథ మాటలు ఆయనివే. హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం మూవీలో తళుక్ మని మెరిసిన చాందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి  టీజర్ దశలోనే అభినందనలు వెల్లువెత్తడం విశేషం. వచ్చే ఏడాది రిలీజ్  కానున్న ఈ మూవీకి ప్రచారం కూడా విభిన్నంగా ఉంటుందని చిత్ర బృందం చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus