మరణం ఫస్ట్ లుక్ విడుదల చేసిన అడివి శేష్!

శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో. వీర్ సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ చిత్రం “మరణం”. కర్మ పేస్ (Karma Pays) ఉప శీర్షిక . ఈ సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని యువ కథానాయకుడు అడివి శేష్ విడుదల చేసారు.

అనంతరం యంగ్ హీరో అడివి శేష్ మాట్లాడుతూ “మరణం ఫస్ట్ లుక్ ను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. పోస్టర్ చాలా బాగుంది మరియు భయపెడుతుంది, నాకు హారర్ చిత్రాలు అంటే భయం కానీ చాలామంది ప్రేక్షకులు ఇలాంటి హారర్ చిత్రాలు బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఇష్టపడతారు. పోస్టర్ ఎంత బాగుందో టీజర్ కూడా అంతే బాగుంది, మంచి సాంకేతిక విలువలతో నిర్మించారు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని అనిపించింది. హీరో దర్శకుడు వీర్ కి హీరోయిన్ శ్రీ రాపాక కి నా శుభాకాంక్షలు. ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

హీరో దర్శకుడు వీర్ సాగర్ మాట్లాడుతూ “మా మరణం సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అడివి శేష్ గారు విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది. మా సినిమా విజయానికి ఇది మా మొదటి అడుగు. మేము పిలవగానే వచ్చి మా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన అడివి శేష్ గారికి ధన్యవాదాలు. నన్ను నా కథను నమ్మి మా చిత్రాన్ని నిర్మించిన మా నిర్మాత బి రేణుక గారికి నా ధన్యవాదాలు. మా హీరోయిన్ శ్రీ కి స్పెషల్ థాంక్స్, తాను తన సొంత సినిమాగా పని చేసింది. ఈ సినిమా మా అందరికి మంచి బ్రేక్ ఇస్తుంది” అని తెలిపారు.

హీరోయిన్ శ్రీ రాపాక మాట్లాడుతూ “మా మరణం సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో అడివి శేష్ గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ సినిమా లో మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా హీరో డైరెక్టర్ వీర్ సాగర్ గారికి ధన్యవాదాలు. కరోనా టైం లో లాక్ డౌన్ లో సినిమా చేసాము. అవుట్ ఫుట్ బాగా వస్తుంది. మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న మా టీం కి ధన్యవాదాలు ” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మనోజ్ కుమార్ చేవూరి, చిత్ర నటి మాధురి మరియు ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus