Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 10, 2026 / 10:50 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • మాధవ్ భూపతిరాజు (Hero)
  • దీప బాలు (Heroine)
  • వినోద్ కుమార్, దయానంద్ రెడ్డి, 'బలగం' రూపాలక్ష్మీ, వికాస్ వశిష్ట తదితరులు (Cast)
  • మంచాల నాగరాజ్ (Director)
  • మయూర్ రెడ్డి బండారు (Producer)
  • ప్రశాంత్ ఆర్ విహారి (Music)
  • ప్రశాంత్ అంకిరెడ్డి (Cinematography)
  • సాయి బాబు తలారి (Editor)
  • Release Date : 10th సెప్టెంబర్ 2026
  • మోక్ష ఆర్ట్స్ (Banner)

మాస్ మహారాజ్ రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగాడు. నటనతో రవితేజ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ లో ఇతనికి భీభత్సమైన క్రేజ్ ఉంది. అలాంటి రవితేజ ఫ్యామిలీ నుండీ ఒక హీరో వస్తున్నాడు అంటే.. సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. అలా మాధవ్ భూపతి రాజు (Maadhav Bhupathiraju) పై కూడా ఆడియన్స్ దృష్టి పడింది. ఇతను రవితేజ పెద్ద సోదరుడు రఘు కుమారుడు. వాస్తవానికి ‘మిస్టర్ ఇడియట్’ అనే సినిమాతోనే హీరోగా లాంచ్ అవ్వాలి. కానీ ఎందుకో ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. అందువల్ల ‘మారెమ్మ’ (Maremma) అనే రా అండ్ రస్టిక్ మూవీతో హీరోగా లాంచ్ అవుతున్నాడు. మరి ఈ ‘మారెమ్మ’ మాధవ్ కి ఎలాంటి డెబ్యూ అందించిందో తెలుసుకుందాం రండి:

Maremma Movie Review

Maremma Movie Review and Rating

కథ: తెలంగాణలోని మహిషాపురం అనే మారుమూల గ్రామం. ఒకసారి ఈ గ్రామంలో తీవ్ర విపత్తు సంభవించి జననష్టం, పంటనష్టం జరుగుతుంది. తినడానికి తిండి లేకపోవడంతో పాటు, జనాలు ఏదో తెలియని వ్యాధి బారిన పడి మరణిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊరి జనాలు మారెమ్మ అమ్మవారిని ఆశ్రయిస్తారు. ఎన్నో జంతుబలులు సమర్పిస్తారు, కానీ వారి కష్టాలు తీరవు. అయితే, ఆ ఊరి పెద్దల్లో ఒకరు తన దున్నపోతును తీసుకొచ్చి బలివ్వడంతో వాళ్ళ ఇబ్బందులు తీరుతాయి.దీంతో ప్రతి పదేళ్లకోసారి ఓ దున్నపోతును బలివ్వడం ఆ ఊరి జనాలు ఆనవాయితీగా మార్చుకుంటారు. ఈ క్రమంలో, ఆ ఊరికి చెందిన ఓ ఒంటికన్ను పూజారి.. రాబోయే మూడేళ్లలో ఒకరింట్లో దున్నపోతు పుడుతుందని, దాన్ని పెంచి పెద్దయిన తర్వాత బలివ్వాలని చెబుతాడు.

అలా పుట్టిన ఓ దున్నపోతుకు ‘మారి(Maremma)’ అని పేరు పెడతారు. దాన్ని పెంచే బాధ్యతను కర్ణ అలియాస్ కర్నెకి (మాధవ్ భూపతి) అప్పగిస్తాడు ఆ ఊరి పెద్ద ధర్మన్న (వినోద్ కుమార్). కర్ణ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో, అతని తల్లే అతనికి అన్నీ తానై పెంచుతుంది. కర్ణకి మారి అంటే ప్రాణం. అలాగే తన మరదలు మంజు (దీపా బాలు) అన్నా ఎంతో ప్రేమ. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే, మరోవైపు ఎంతో ఇష్టంగా పెంచుకున్న మారిని బలివ్వడం కర్ణకు నచ్చదు. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెబుతాడు. సరిగ్గా బలివ్వాల్సిన రోజు వచ్చినప్పుడు నిజంగానే మారి మాయమవుతుంది. అసలు మారిని అపహరించింది ఎవరు? జలంధర్ (వికాస్ వశిష్ట) మహిషాపురం జనాలపై ఎందుకు పగ పెంచుకున్నాడు? చివరికి కర్ణకి మారి దొరికిందా? లేదా? అనేది మిగిలిన కథ.

Maremma Movie Review and Rating

నటీనటుల పనితీరు: కర్ణగా మాధవ్ భూపతి బాగానే సెట్ అయ్యాడు. అతని మేకోవర్ బాగుంది. కానీ ఒక్కటంటే ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా పలికించలేకపోయాడు. అతని యాక్టింగ్లో ఈజ్ కూడా లేదు. అందుకే అనుకుంట దర్శకుడు అతనికి సినిమా మొత్తంలో ఒక్క క్లోజప్ షాట్ కూడా పెట్టలేదు. డైలాగ్ డెలివరీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అతను పలికిన ఏ డైలాగ్ కూడా ఆడియన్స్ కి అర్ధం కాదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. యాక్టింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ అవ్వాలి మాధవ్. మంజు పాత్రలో దీప బాలు బాగా సెట్ అయ్యింది. ఆమె లుక్స్, మేకోవర్ అంతా బాగుంది.

కాకపోతే పాత్రలో డెప్త్ లేదు. వినోద్ కుమార్ పాత్ర కూడా కన్విన్సింగ్ గా లేదు. విలన్ గా చేసిన వికాస్ వశిష్ట కూడా ఆ పాత్రకి అస్సలు సెట్ అవ్వలేదు. అతని డైలాగులు, ఎక్స్ప్రెషన్స్ ఏవీ కూడా ఆకట్టుకోవు. ‘బలగం’ రూపలక్ష్మీ పాత్ర, మేకోవర్ కొత్తగా ఉన్నాయి. ఆమె కూడా బాగా చేసింది. ఇంకాసేపు ఈ పాత్రని కంటిన్యూ చేస్తే బాగుండేది అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగించింది రూపాలక్ష్మీ. మిగతా నటీనటుల పాత్రలు అంతంత మాత్రమే.

Maremma Movie Review and Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: రూటెడ్ స్టోరీస్ కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా వాటికి రా అండ్ రస్టిక్ ఫీల్ తగిలిస్తే ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. ‘రంగస్థలం’ నుండి ఇటీవల వచ్చిన ‘ఇరుముడి’ ఎలాంటి విజయాలు అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈ రూటెడ్(మట్టికథలు) కథల నుండీ ఆడియన్స్ కోరుకునేది సహజత్వం. ఇంకా చెప్పాలంటే ఒరిజినాలిటీ. అది ‘మారెమ్మ’ (Maremma) లో పూర్తిగా లోపించింది. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకే ట్రాక్ తప్పిన ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. అలా డిస కనెక్ట్ అయిపోయిన ఆడియన్స్ ఎక్కడా కనెక్ట్ కారు. నెక్స్ట్ సీన్ ముందుగానే ఊహించే విధంగా ఉంటుంది. అలా వచ్చే సన్నివేశాల్లో ఒక్కటి కూడా పాస్ మార్కులు వేసే విధంగా ఉండదు. పైగా సినిమా మొత్తం అయిపోయాక.. ‘దేవుడు గురించి, భక్తి గురించి, జంతు బలుల’ గురించి కొంత ఫిలాసఫీ చెబుతారు. దానికి సినిమా కథకి అస్సలు సంబంధం ఉండదు.

బహుశా ‘నేను పేపర్ మీద రాసుకున్న కథ ఒకటి.. తీసింది ఇంకొకటి’ అని దర్శకుడు పరోక్షంగా చెప్పాడు అనుకోవాలేమో. మిగిలిన అంశాల గురించి మాట్లాడుకోవాలంటే.. ‘మారెమ్మ’ కి (Maremma) ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ మ్యూజిక్. 3 పాటలు వినసొంపుగా ఉన్నాయి. ‘మారి..’ ‘బావ బావ’ సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా వీక్ గా ఉంది. కొన్ని సన్నివేశాల్లో హీరో మాట్లాడుతుంటే.. దున్నపోతుకి క్లోజప్ షాట్స్ పడతాయి. ఇంకో చోట దున్నపోతు యాక్షన్ సీన్స్ వస్తుంటే.. కెమెరా యాంగిల్స్ ఇంకెక్కడో ఉంటాయి. లొకేషన్స్ కూడా నేచురల్ గా అనిపించవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి.

Maremma Movie Review and Rating

విశ్లేషణ: ‘మారెమ్మ’ (Maremma) సినిమాలో 2, 3 పాటలు మినహా గొప్పగా చెప్పుకునే విధంగా ఇంకో అంశం కనిపించదు. థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులను పూర్తిస్థాయిలో డిజప్పాయింట్ చేసి పంపే సినిమా ఇది.

Maremma Movie Review and Rating

ఫోకస్ పాయింట్: ‘మరెమ్మా’… కష్టమమ్మా

రేటింగ్: 1/5

 

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepa Balu
  • #Maadhav Bhupathiraju
  • #Maremma Movie
  • #Nagaraj Manchala

Reviews

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

trending news

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

32 mins ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 days ago

latest news

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

23 hours ago
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

1 day ago
Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

1 day ago
ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

1 day ago
Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version