ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో దర్శకుడు మారుతీ(Maruthi) స్పీచ్ ఇస్తున్న క్రమంలో కన్నీళ్లు పెట్టుకున్నారు.
మారుతీ మాట్లాడుతూ… ‘రెబల్ సాబ్.. రెబల్ సాబ్’ అనే లిరిక్ నేనే రాశాను. చాలా మాట్లాడాలని ఉంది.. చాలా చెప్పాలని ఉంది. రెబల్స్ అందరికీ చాలా చాలా థాంక్స్.బిగినింగ్ నుండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను ఈరోజు ఇలా నిలబడడానికి కారణం ఇద్దరే ఇద్దరు. ఒకరు నా కింగ్ సైజ్ కటౌట్ ప్రభాస్ ఒకరైతే.. ఇంకొకరు నిర్మాత విశ్వ గారు. ఆయన లైఫ్ పెట్టేశారు.
ఓ సాదా సీదా ఫంక్షన్ కాదు ఇది. ప్రభాస్ గారిని తీసుకొచ్చినప్పుడు ఆ రేంజ్ ఫుడ్డే పెట్టాలని డిసైడ్ అయ్యాం. ‘ఆదిపురుష్’ జరుగుతున్నప్పుడు ముంబై నుండి కాల్ వచ్చింది. నేను వెళ్ళాను అప్పుడు రాముడి గెటప్లో ఉన్నారు. కాసేపు నవ్వించాను. సౌత్ ఆఫ్రికాలో మసైబారాలో కూడా ప్రభాస్ అంటే తెలుసు. రాజమౌళికి మా దర్శకులమంతా రుణపడి ఉన్నాం. ఈరోజు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయంటే.. ఆయన వల్లనే.
నాలాంటి మిడ్ రేంజ్ దర్శకుడిని కూడా రెబల్ యూనివర్సిటీలో చేర్పించుకుని నన్ను ఈ రేంజ్లో నిలబెట్టారు. నేను రాశాను.. నేను తీశాను.. కానీ ఆయన(ప్రభాస్) మాత్రం లైఫ్ పెట్టేశారు. అన్ని భాషల్లోనూ సక్సెస్ సాధించే పొటెన్షియాలిటీ ‘ది రాజాసాబ్’ లో ఉంది. నేను తీసిన సినిమాని చూసుకుని ఏడ్చేసేవాడిని. అంత ప్రాణం పెట్టేసిన ప్రభాస్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను” అంటూ కన్నీళ్లు పెట్టేసుకున్నారు మారుతీ.ఆ తర్వాత ప్రభాస్ స్టేజి ఎక్కి అతన్ని ఓదార్చాడు. ‘మూడేళ్ళ కష్టం ఇది’ అంటూ సర్దిచెప్పాడు.