Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్స్ కావాలని ప్రభాస్(Prabhas) తెలిపారు. ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఆయన చేసిన ఈ కామెంట్స్ హైలెట్ అయ్యాయి.

Prabhas

ప్రభాస్ మాట్లాడుతూ… “నాకు సుమ గారు అంటే చాలా ఇష్టం. ఆమె ఈవెంట్లో ఉంటే.. అందరికీ జోష్ వస్తుంది. మీకు నచ్చింది అని పిలక వేసుకుని వచ్చాను. ఈ చలిలో ఇంతమంది వచ్చారు. అనిల్ తడాని నాకు సోదరుడు లాంటివాడు. సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజన్స్.. ఒక్క క్లోజప్ పెడితే తినేస్తారు అంతే. నానమ్మ క్యారెక్టర్ చేసిన నటి అద్భుతంగా చేశారు. రిద్ది చాలా కష్టపడి చేసింది.

మాళవిక రెండున్నరేళ్లు కష్టపడింది. నిధి అయితే సెట్లో అందరికీ ఫేవరెట్. ఒకరోజు స్టేజిపై మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను షేక్ అయిపోతారు. ‘ది రాజాసాబ్’ కి మరో హీరో నిర్మాత విశ్వప్రసాద్. ఈ సినిమాకి మొదట అనుకున్న బడ్జెట్ ఒకటి. తర్వాత అది పెరిగిపోయింది. అయినా ఆయన భయపడలేదు. తమన్ డార్లింగ్ ఒక్కడే ఈ లెవెల్ ఆర్ ఆర్ మనకి ఇండియాలో ఇచ్చేది.

తమన్ రేంజ్ దైర్యం నాకు లేదు. అతనిలా సూట్ ఏసుకుని వచ్చే ధైర్యం నాకు లేదు. డీవోపీ కార్తీక్ మంచి క్వాలిటీ ఔట్పుట్ ఇచ్చారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్, సోలమన్ మాస్టర్ ఫైట్స్ ఇరగదీసేశారు. మారుతీ గారు 3 ఏళ్ళు కష్టపడి తీశారు. ఆయన స్ట్రెస్, పెయిన్, కష్టం అన్నీ ఎక్కువవడంతో ఎమోషనల్ అయిపోయారు. మొదట ఓ కథ అనుకున్నాం. తర్వాత అది హర్రర్ కామెడీ అయ్యింది. నేను అయితే మారుతీ రైటింగ్ కి ఫ్యాన్ అయిపోయాను. క్లైమాక్స్ అయితే పెన్ తో రాశారో.. మిషన్ గన్ తో రాశారో నాకే తెలీదు. హర్రర్ సినిమాల్లో అది ప్రత్యేకంగా నిలుస్తుంది. మారుతీ డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్స్ అవ్వాలి. మరీ ముఖ్యంగా సీనియర్ సీనియరే. వాళ్ళ నుండే మేము అన్నీ నేర్చుకున్నాం. అందరి సినిమాలు బాగా ఆడాలి. మా సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus