యువహీరో కోసం మారుతి ఎదురుచూపు!!!

టాలీవుడ్ దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్కూల్….ఒకరు సెంటిమెంట్ సినిమా తీస్తూ ఉంటే…మరొకరు యాక్షన్ కధలను ఎంచుకుంటారు. కొందరు పూర్తిగా కామెడీ బేస్డ్ కధలనే ఎంచుకుని సినిమాలు తీస్తూ ఉంటారు…అయితే తాజాగా టాలీవుడ్ లో యూత్‌ఫుల్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ ఆ మారిన  మన యువ దర్శకుడు మారుతి….ఈరోజుల్లో సినిమాతో మంచి సూపర్ హిట్ సాధించడమే కాకుండా…కాస్త స్పైసీ స్పైసీ స్క్రీన్‌ప్లే తో సినిమాను గట్టు ఎక్కించేస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు…అయితే అలాంటి స్పైసీ మారుతి….భలే..భలే…మగాడివోయ్ వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టేనర్ తీసి…టాలీవుడ్ టాప్ హీరో వెంకటేష్ తో బాబు బంగారం చేసే అవకాశం కొట్టేసాడు.

అయితే కధ పరంగా…కధనం పరంగా….సినిమా ఒకే అనిపించినా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా పెద్దగా చప్పుడు చెయ్యలేదు….ఇక తాజాగా మారుతి కన్ను ఒక కుర్ర హీరోపై పడిందని టాక్..ఇంతకీ ఆ హీరో ఎవరు…ఏంటి కధ అంటే….మాత్రం మీరు ఈ మ్యాటర్ చదవాల్సిందే…ఎవడే సుబ్రమణ్యం సినిమాతో స్పెషల్ క్యారక్టర్ చేసి పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు హిట్ తో దాదాపు వరుస హిట్ల మీద ఉన్న కుర్ర హీరోలందరికి మంచి కాంపిటీటర్ అయ్యాడు ఈ కుర్ర హీరో.. అయితే వరుస హిట్స్ రావడంతో ఈ హీరోతో సినిమా చేసేందుకు వెంటపడుతున్నారు దర్శక నిర్మాతలు….ఇక బాబు బంగారం తర్వాత ఒకేసారి మళ్లీ పెద్ద హీరోతో కాకుండా ఓ కుర్ర హీరోతో సినిమా చేసే ఆలోచనలో ఉన్న మారుతి విజయ్ కు గాలం వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విజయ్ కోసం ఒక కధ రెడీ చేసుకున్న మారుతి త్వరలోనే విజయ్ ని కలసి ఈ కధ చెప్పి సినిమాను  పట్టాలపైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

https://www.youtube.com/watch?v=Is3BAzHojnc

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus