తక్కువ రోజుల్లో, పరిమిత బడ్జెట్ లో సినిమాలు తీస్తూ హిట్స్ అందుకోవడం మారుతి స్పెషాలిటీ. ‘ఈరోజుల్లో’ లాంటి సినిమా తరువాత మారుతికి ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వచ్చాయి. నాని, వెంకటేష్ లాంటి హీరోలను డైరెక్ట్ చేశాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా.. ఎక్కువ ఖర్చు పెట్టకుండా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. ఇలాంటి డైరెక్టర్ భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది..?
అసలు ఈ తరహా సినిమాలు మారుతి హ్యాండిల్ చేయగలడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి కదూ.. కానీ తను మాత్రం ఆ టైప్ సినిమాలు తీయగలనని చెబుతున్నాడు మారుతి. ఈ తరహా సినిమాలకు పని చేసిన అనుభవం కూడా తనకు ఉందని మారుతి చెబుతున్నాడు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో స్కెచింగ్ వేయడం, స్టోరీ బోర్డు వేయడం వంటి పనులు చేశానని.. ఆ సమయంలో ‘అంజి’ లాంటి భారీ సినిమాకి పని చేసే ఛాన్స్ వచ్చిందని..
ఈ అనుభవం తనకు ఎంతో ఉపయోగపడిందని ఓ టీవీ షోలో మారుతి వెల్లడించాడు. గ్రాఫిక్స్ ప్రదాయంగా సినిమాలు తీయగలరా..? అని అడిగితే.. కచ్చితంగా చేయగలనని.. తాను అలాంటి సినిమా చేస్తే అది నెక్స్ట్ లెవెల్ విజువల్ వండర్ గా ఉంటుందని మారుతి తెలిపాడు. ఫ్యూచర్ లో కచ్చితంగా ఈ తరహా భారీ సినిమా చేస్తానని మారుతి ధీమా వ్యక్తం చేశారు.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!