కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’. ‘ఖైదీ'(2019) ఫేమ్ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలయ్యి టాక్ తో సంబంధం లేకుండా ఇక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విజయ్ సేతుపతి నటన, అనిరుథ్ అందించిన మ్యూజిక్.. విజయ్ స్టార్ డం కలగలిపి.. ఈ చిత్రాన్ని సక్సెస్ బాట పట్టించాయి అని చెప్పొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో అయితే విడుదలైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.56 cr |
సీడెడ్ | 2.71 cr |
ఉత్తరాంధ్ర | 2.51 cr |
ఈస్ట్ | 1.34 cr |
వెస్ట్ | 1.25 cr |
కృష్ణా | 1.17 cr |
గుంటూరు | 1.41 cr |
నెల్లూరు | 0.65 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 14.60 cr |
తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రానికి 9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 14.60 కోట్ల షేర్ ను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 5.6 కోట్ల వరకూ లాభాలను మిగిల్చిందని చెప్పొచ్చు. పోటీగా మరో నాలుగు తెలుగు సినిమాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం సక్సెస్ ఫుల్ మూవీగా నిలవడం విశేషం.
Click Here To Read Movie Review
Most Recommended Video
జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?