డిసెంబర్ లో రిలీజ్ కానున్న నాని, సాయి పల్లవి ‘ఎం.సి.ఏ’

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `ఎంసీఏ` షూటింగ్ 50 శాతం పూర్త‌యింది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. ఈ సంస్థ‌లో ఇటీవ‌ల `ఫిదా`తో తెలుగువారి మ‌న‌సుల్ని దోచుకున్న సాయిప‌ల్ల‌వి తొలిసారి నానితో జోడీక‌డుతున్నారు. శ‌్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్‌రాజు మాట్లాడుతూ – “మా బ్యానర్ లో నాని హీరోగా ఈ ఏడాది `నేను లోక‌ల్‌` సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌డూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మా హిట్ కాంబినేష‌న్ మ‌రోసారి పున‌రావృత్తం అవుతుంది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న `ఎంసిఎ` చిత్రం మా బ్యాన‌ర్‌లో మ‌రో హిట్ చిత్రంగా నిలుస్తుంది.

అద్భుత‌మైన క‌థ‌, అన్నీ స‌మ‌పాళ్ళ‌లోనఎలిమెంట్స్‌తో ఈ చిత్రంలో నానిని ద‌ర్శ‌కుడు వేణు స‌రికొత్త స్ట‌యిల్లో చూపించ‌నున్నారు. .నేను లోక‌ల్ చిత్రానికి ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి నానికి జోడిగా న‌టిస్తుండ‌గా, ప్ర‌ముఖ హీరోయిన్ భూమిక ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, ప్రేక్ష‌కుల్లో మా బ్యాన‌ర్ వాల్యూను పెంచే చిత్ర‌మ‌వుతుంది భావిస్తున్నాను. సినిమా 50 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను మొదలుపెట్టాం. డబ్బింగ్ పూజ తో ఈ కార్యక్రమాలకు నాంది పలికాము. సినిమాను డిసెంబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus