మాస్ క దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నుండి ఈ ఏడాది ఆల్రెడీ 2 సినిమాలు వచ్చాయి. అవే ‘గామి’ (Gaami) ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari) . ఇప్పుడు మూడో సినిమాగా ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) రాబోతుంది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) ..లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నరేష్ (Naresh) , సునీల్ (Sunil)..లు కీలక పాత్రలు పోషించారు. టీజర్, రెండు ట్రైలర్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామ్ తాళ్లూరి (Ram Talluri) ఈ చిత్రాన్ని నిర్మించారు.
రవితేజ ముళ్ళపూడి దర్శకుడు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సురేష్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుంది. థియేట్రికల్ బిజినెస్ అయితే బాగానే జరిగింది. ఒకసారి బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ వంటి వివరాలను గమనిస్తే :
నైజాం | 3.50 cr |
సీడెడ్ | 1.00 cr |
ఆంధ్ర(టోటల్) | 3.00 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 7.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.50 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 9.00 cr |
‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) చిత్రానికి రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే.. కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అన్ సీజన్లో అది సాధ్యమవుతుందా? లేదా అనేది చూడాలి.