Ajith: ‘ప్రిన్స్’ రిజల్ట్ పై అజిత్ కామెంట్స్.. గొప్ప విషయమే!

శివ కార్తికేయన్ (Sivakarthikeyan) తమిళంలో నాని రేంజ్ హీరో. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సొంత టాలెంట్ తో పైకొచ్చాడు. హిట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న హీరో కూడా..! ‘రెమో’ (Remo) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ‘డాక్టర్’ సినిమాతో అతనికి మంచి ఇమేజ్ ఏర్పడింది. దీంతో అతను స్ట్రైట్ తెలుగు మూవీ చేశాడు. అదే ‘ప్రిన్స్’. అనుదీప్ (Anudeep Kv) డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ‘జాతి రత్నాలు’ ( Jathi Ratnalu) తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనుదీప్, ‘డాక్టర్’ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన శివకార్తికేయన్ కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే..

Ajith

సహజంగానే మంచి అంచనాలు ఏర్పడాలి. కానీ ఎందుకో ఈ సినిమాకు బజ్ ఏర్పడలేదు. సినిమా కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక ఈ సినిమా ఫలితం గురించి మొన్నామధ్య శివ కార్తికేయన్ స్పందించాడు. ‘తాను కాకుండా చిన్న హీరో చేసుంటే ఆ సినిమా హిట్ అయ్యేది’ అని తెలిపాడు. దానిపై మిక్స్డ్ కామెంట్స్ వచ్చాయి.

ఇటీవల మరోసారి ‘ప్రిన్స్’ సినిమా గురించి స్పందించాడు శివ కార్తికేయన్. ఇటీవల అతని నుండి వచ్చిన ‘అమరన్’ (Amaran)  పెద్ద హిట్ అయ్యింది. ఈ సందర్భంగా అతను పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. ” ‘ప్రిన్స్’ సినిమా గురించి అజిత్ (Ajith) సార్ పలికిన మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.

‘మంచి అటెంప్ట్’ అని అన్నారు. కానీ ఆ సినిమా ఆడలేదు కాబట్టి.. ‘వెల్కమ్ టు స్టార్ క్లబ్’ అని అన్నారు. ఆయన కామెంట్ తో నేను షాకయ్యను” అంటూ శివ కార్తికేయన్ చెప్పుకొచ్చాడు. ఇక శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు(గ్రాస్) వసూళ్లు సాధించింది.

టీమ్ లోకి మరో అగ్ర నిర్మాత కూడా.. ఎందుకంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus