ఎంత హీరోయిన్ అయినా అమ్మాయే కదా.. ఫస్ట్ క్రష్‌లు, ఫస్ట్ లవ్‌లు ఉంటాయి. అలా ప్రజెంట్ సెన్సేషనల్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి (Meenakshi Chaudhary) కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమెనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సగటు అమ్మాయిలా తన ఫస్ట్ క్రష్ ఉండటం గమనార్హం. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుండి ‘సేమ్ పించ్’ అని అమ్మాయిలు మురిసిపోతున్నారు. అంతగా ఏం చెప్పింది అనేగా మీ డౌట్. చాలా మంది అమ్మాయిల్లాగే స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే మీనాక్షికి క్రష్ ఉండేదట.
వాళ్ల స్కూల్ టీచర్ అంటే ఆమెకు బాగా ఇష్టమట. ఆయనంటే ఒక్క దానికే కాదు స్కూలులో ఉండే అమ్మాయిలందరికి ఆతని పై క్రష్ ఉండేదట. క్రష్ అక్కడితోనే ఆగిపోయిందట. ఆ తర్వాత ఎవరిని చూసినా ఆ ఫీలింగ్ కలగలేదు అని మీనాక్షి చెప్పింది. హర్యానాలోని పంచకుల ప్రాంతానికి చెందిన మీనాక్షి పంజాబ్‌లోని నేషనల్ డెంటల్ కాలేజీ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. ఆ సమయంలోనే ఆమెకు మోడలింగ్‌లో అవకాశం వచ్చింది.
ఆ తర్వాత 2018లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేసింది ఈ డెంటిస్ట్. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ అనే సినిమాతో హీరోయిన్‌గా వచ్చిన మీనాక్షి ‘ఖిలాడీ’(Khiladi), ‘హిట్ 2’ (HIT: The Second Case), ‘గుంటూరు కారం’(Guntur Kaaram), ‘మట్కా’(Matka) , ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) సినిమాలు చేసింది. ఈ క్రమంలో పేరొచ్చిన ఆఫర్లు కనిపించలేదు.
కానీ ‘లక్కీ భాస్కర్’లో (Lucky Baskhar) సుమతిగా ఆమెను చూసిన తర్వాత అవకాశాలు బాగా వస్తున్నాయని టాక్. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో (Sankranthiki Vasthunam) సొంత పేరుతో నటించాక ఇప్పుడు ఇంకా వస్తున్నాయి అంటున్నారు. అయితే ఇంకా ఏ సినిమానూ ఆమె అనౌన్స్ చేయలేదు. అన్నట్లు మధ్యలో ‘కోలాయి’, ‘సింగపూపర్ సెలూన్’, ‘ది గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలూ చేసింది.