ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సైఫ్ అలీ ఖాన్‌పై (Saif Ali Khan) ఇటీవల దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో అతనిని గుర్తించిన రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో నిందితుడు ప్రయాణిస్తుండగా పట్టుకున్నారు. కన్ఫర్మేషన్ కోసం వీడియో కాల్ ద్వారా ముంబయి పోలీసులతో మాట్లాడి ధ్రువీకరించుకున్నారు. ఇక రైల్వే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తీసుకొచ్చేందుకు ముంబయి పోలీసులు ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది.
సైఫ్ అలీ ఖాన్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడని సమాచారం. సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారయ్యాడు. ‘‘సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ప్రస్తుతం నటుడికి ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. ఈ విషయంపై అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఇది పోలీసు కేసుకు సంబంధించిన వ్యవహారం.
పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తాం’’ అని ఘటన జరిగిన ఉదయం సైఫ్ అలీ ఖాన్ టీమ్ అనౌన్స్ చేసింది. మరోవైపు కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. దుండగుడిని పట్టుకున్నారు. మరోవైపు ఈ ఘటనలో సైఫ్ గాయపడ్డ సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.