Pushpa 2: ఈ సీన్లు ఫస్ట్ కట్ లో ఎందుకు రిలీజ్ చేసావ్ సుక్కు!

పుష్ప 2 (Pushpa 2 The Rule)  రీలోడెడ్ అంటూ జనవరి 17 నుండి 20 నిమిషాలు యాడ్ చేసిన వెర్షన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. నిజానికి జనవరి 11న ఈ వెర్షన్ ను రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ.. సంక్రాంతి సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది అని కాస్త డిలే చేశారు. అయితే.. డిసెంబర్ 4న ఈ సినిమా చూసినవాళ్లందరికీ చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. ముఖ్యంగా.. జపాన్ పోర్ట్ సీన్ కి అసలు సంబంధం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అలాగే.. పుష్ప మెడలో చెయిన్ ఎందుకు వేయలేదు అని చాలా మంది ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ రీలోడెడ్ వెర్షన్ తో వచ్చింది. మరి ఈ కొత్త వెర్షన్ లో యాడ్ చేసిన సీన్స్ ఏమిటి? వాటి కోసం మళ్లీ థియేటర్లలో సినిమాను చూడాలా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వండి.

Pushpa 2

1. ఇంటర్వెల్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) – ఫహాద్ (Fahadh Faasil) మధ్య వచ్చే మైమ్ ఎపిసోడ్ లో.. మూడు పువ్వులు డైలాగ్ తర్వాత అనసూయ చెప్పిన కొన్ని డైలాగ్స్ యాడ్ చేశారు.

2. జాతర సీక్వెన్స్ అనంతరం షెకావత్-మంగళం శీను (సునీల్)(Sunil) కాంబినేషన్ సీన్ యాడ్ చేశారు.

3. సిండికేట్ మీటింగ్ కి పుష్ప అటెండ్ అయ్యే సీన్. చాలా పవర్ ఫుల్ గా ఉంది సీన్, ఎందుకని డిలీట్ చేసారో అస్సలు అర్థం కాలేదు. అల్లు అర్జున్ “నేను ఇది ఎర్ర చొక్కా అంటే నమ్మాలి” అనే సీక్వెన్స్ భలే ఎలివేట్ చేసింది.

4. రామేశ్వరం సీక్వెన్స్ లో ఒక ఛేజ్ సీన్ యాడ్ చేశారు. ఆ సీన్ చివర్లో జక్కారెడ్డి చనిపోయే సీన్ మరియు హమీద్ పోలీసులకి దొరికిపోయి సీన్ యాడ్ చేశారు.

5. అలాగే.. పుష్ప జపాన్ ఎందుకు వెళ్తాడు అనేందుకు సరైన లీడింగ్ సీన్ కూడా యాడ్ చేశారు.

6. పుష్ప కంటైనర్లో ఎందుకు కూర్చున్నాడు? జపాన్ ఎందుకు వెళ్ళాడు అనేది అర్థమయ్యే సీన్ కూడా యాడ్ చేశారు.

7. ట్రైలర్లో చూపించిన జపాన్ రెస్టారెంట్ షాట్ సీన్ కూడా యాడ్ చేశారు.

8. డబ్బు నిండిన లారీ కంటైనర్ తిరుపతి ఎలా వచ్చింది అనే సీన్ కి కూడా లీడ్ యాడ్ చేశారు.

9. జక్కా రెడ్డి మరణం అనంతరం పుష్ప స్వయంగా డబ్బు ఉన్న సోఫా తీసుకొని జాలి రెడ్డిని కలిసి సిండికేట్ లో కలిసిపోమని మాట్లాడే సీన్ యాడ్ చేశారు.

10. ముఖ్యమంత్రిగా రావు రమేష్ ప్రమాణ స్వీకారం చేసే సీన్ యాడ్ చేశారు.

11. ఫోర్ట్ ఫైట్ సీన్ లో లెంగ్త్ ఎక్కువై డిలీట్ చేసిన కొన్ని క్లిప్స్ యాడ్ చేశారు.

12. పుష్ప ఇంటికి అన్న అజయ్ (Ajay) వచ్చే సీన్ లో కొన్ని క్లిప్స్ యాడ్ చేశారు.

13. అలాగే.. అజయ్ పాత్ర పుష్ప తల్లి కాళ్ల మీద పడి క్షమాపణ కోరే సీన్ యాడ్ చేశారు.

14. పెళ్లికి వచ్చిన పుష్పరాజ్ ని అన్నలిద్దరూ కావలించుకొనే సీన్ యాడ్ చేసారు.

15. పుష్ప నుండి చిన్నప్పుడు లాక్కున్న చైన్ ను పుష్పరాజ్ మెడలో అజయ్ వేసే సీన్ యాడ్ చేశారు.

డాకూ మహరాజ్ తర్వాత బాబీ ప్లాన్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus