మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో చిత్రంగా ‘గుంటూరు కారం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ చిత్రం నుండీ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ లో అనుకోకుండా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ చిత్రంలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ అని, సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల అని ప్రకటించారు. షూటింగ్ కూడా జరిగింది.
కానీ ఇప్పుడు పూజా హెగ్డే ప్లేస్ లో శ్రీలీలకి మెయిన్ హీరోయిన్ గా అవకాశం దక్కినట్టు తెలుస్తుంది. ఇక శ్రీలీల ప్లేస్ లో అంటే సెకండ్ హీరోయిన్ ప్లేస్ లో ఏ హీరోయిన్ నటిస్తుంది? అనే డౌట్ అందరిలోనూ ఏర్పడింది? ఈ క్రమంలో ‘సార్’ బ్యూటీ సంయుక్త మీనన్ పేరు ఎక్కువగా వినిపించింది. కానీ ఎందుకో ఆమెను టీం ఫైనల్ చేయలేదు. ‘హిట్ 2 ‘ బ్యూటీ మీనాక్షీ చౌదరిని ఫైనల్ చేశారు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘ఖిలాడీ’, ‘హిట్ 2 ‘ వంటి చిత్రాలతో మీనాక్షీ చౌదరి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.
ఆమె మంచి హైట్ కూడా..! సో మహేష్ సరసన కరెక్ట్ గా సరిపోతుంది అని టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక (Guntur Kaaram) ఈ చిత్రాన్ని జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ కనుక పోస్ట్ పోన్ అయితే జనవరి 12 నే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.