Meenakshi Chaudhary: ఒకే షెడ్యూల్‌లో సినిమా.. డైరక్టర్‌ కమ్‌ హీరోతో మీనాక్షి చౌదరి

2024లో ఆరు సినిమాలతో బిజీగా గడిపిన మీనాక్షి చౌదరి నుండి 2025లో మాత్రం ఒక్క సినిమానే వచ్చింది. ప్లానింగ్‌ అలా చేసుకుందో, లేక ఏమైందో కానీ.. ఒక్క సినిమాతోనే ఆమె గతేడాది ముగించింది. అయితే ఏడాది మళ్లీ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్‌ మీద ఉండగా.. మూడో సినిమాను ఓకే చేసింది అని సమాచారం. ఈ సినిమా ఆమెకు తమిళంలో కూడా ఫేమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. గతంలో ఓసారి ఆమె కోలీవుడ్‌లో నటించినా సరైన ఫలితం రాని విషయం తెలిసిందే.

Meenakshi Chaudhary

ఇక ప్రస్తుతానికి వస్తే.. ‘లవ్‌ టుడే’తో నటుడిగా, దర్శకుడిగా టాలెంట్‌ చూపించిన ప్రదీప్‌ రంగనాథన్‌ మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. గతేడాది వరుస విజయాలతో దూసుకెళ్లి ప్రదీప్‌.. ఇప్పుడు మరోసారి రెండు పడవల ప్రయాణం చేయబోతున్నాడు. కెప్టెన్‌ కుర్చీలో కూర్చుంటూనే హీరోగా ఓ సినిమా చేయనున్నాడు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రదీప్‌ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోందని సమాచారం.

‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతికి రాబోతున్న మీనాక్షి.. చౌదరి చేతిలో నాగచైతన్య ‘వృషకర్మ’ ఉంది. ఈ సినిమా తర్వాత ప్రదీప్‌ రంగనాథన్‌ సినిమా చేస్తుందట. మార్చిలో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లి.. ఒకే షెడ్యూల్‌లో షూటింగ్‌ని పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ప్రీప్రొడక్షన్‌ పనులను వేగవంతం చేశారట ప్రదీప్‌. ప్రేమకథలు – మధ్యతరగతి భావోద్వేగాలతో ఇప్పటికే అభిమానులను అలరించిన ఆయన.. ఈ సైన్స్‌ఫిక్షన్‌ కథతో ఏం చేస్తారో చూడాలి.

మీనాక్షి విషయానికొస్తే.. ఇప్పటివరకు తమిళంలో ‘కోలాయి’, ‘సింగపూర్‌ సెలోన్‌’, విజయ్‌ దశపతితో ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ – గోట్‌’ సినిమాలు చేసింది. ఈ మూడు ఆమెకు ఆశించిన పేరును అయితే తీసుకురాలేదు. ఇప్పడు మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ప్రదీప్‌ సినిమా కాబట్టి తెలుగులో ఎలాగూ రిలీజ్‌ చేస్తారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus