Bro,Bhola Shankar: బిజినెస్ లో సంచలనాలు సృష్టిస్తున్న బ్రో, భోళా శంకర్.. కానీ?

Advertisement

పవన్, సాయితేజ్ కాంబోలో తెరకెక్కిన బ్రో సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు కావడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బ్రో సినిమాకు త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందించగా ఈ సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్స్ తూటాలలా పేలనున్నాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక అభిమానం ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

బ్రో సినిమా బిజినెస్ విషయంలో సంతృప్తితో ఉన్నామని ఈ సినిమాకు టికెట్ రేట్లు సైతం పెంచాల్సిన అవసరం అయితే లేదని నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. పవన్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా ఈ సినిమా నిలవడం గమనార్హం. అయితే బ్రో సినిమా విడుదలైన రెండు వారాలకే భోళా శంకర్ సినిమా కూడా కూడా రిలీజ్ కానుంది. తాజాగా భోళా శంకర్ సినిమా నుంచి విడుదలైన పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

భోళా శంకర్ సినిమాకు సైతం భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోందనే సంగతి తెలిసిందే. భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే బ్రో, భోళా శంకర్ సినిమాలకు దాదాపుగా ఒకే స్థాయిలో బిజినెస్ జరగగా ఈ రెండు సినిమాలలో కలెక్షన్లలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందనే చర్చ జరుగుతుండటం గమనార్హం.

బ్రో, భోళా శంకర్ (Bhola Shankar) సినిమాలు కమర్షియల్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. బ్రో, భోళా శంకర్ బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని మెగా అభిమానులు కోరుకున్న విజయాలను అందిస్తాయేమో చూడాలి. బ్రో సినిమాకు సముద్రఖని డైరెక్టర్ కాగా భోళా శంకర్ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రో, భోళా శంకర్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయేమో చూడాల్సి ఉంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus