“మెగా హీరో” అనే బ్రాండ్ ఒక్కసారి పడిందంటే హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసబెట్టి అవకాశాలు చుట్టుముడుతుంటాయి. కానీ.. మెగా టీం లో కొత్తగా జాయిన్ అయిన చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కి మాత్రం ఆ అదృష్టం ఉన్నట్లుగా కనిపించడం లేదు. అందుకు కారణం మనోడి సినిమా ఆగిపోవడమే. పులి వాసు దర్శకత్వంలో సుధీర్ బాబు-మెహరీన్ ల కాంబినేషన్ లో మొదలైన సినిమా నుంచి సుధీర్ బాబు తప్పుకోవడంతో హీరోగా కళ్యాణ్ దేవ్ ను తీసుకొన్నారు. కానీ.. కళ్యాణ్ దేవ్ తో నటించడం ఇష్టం లేక మెహరీన్ ఆ ప్రొజెక్ట్ నుంచి తప్పుకొంది. దాంతో హీరోయిన్ ని వెతకడం కోసం కొన్నాళ్లు ప్రొజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారు.
ఆ తర్వాత చిరంజీవి & కో స్క్రిప్ట్ విషయంలో మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం, ఎప్పటికప్పుడు భారీ స్థాయిలో మార్పులు సూచించడం అనేది నిర్మాత రిజ్వాన్ కు గానీ.. దర్శకుడు పులీ వాసుకు గానీ నచ్చడం లేదట. దాంతో స్క్రిప్ట్ పూర్తయ్యేవరకూ సినిమానే హోల్డ్ లో పెట్టేశారు. దాంతో కళ్యాణ్ దేవ్ సినిమా ఆగిపోయిందనే వార్తలు హల్ చల్ చేయడం మొదలెట్టాయి. మరి కళ్యాణ్ సెకండ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. అసలు హీరోగా రాణించగల అదృష్టం బాబుకి ఉందో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.