సిస్టర్ తో సెల్ఫీలో కిక్కే వేరప్పా..!

మెగా హీరోలు యాక్టర్స్ ఎంతమంది అని అడిగితే.. ఎంతటి మెగా ఫ్యాన్ కి అయినా టక్కుమని లెక్క చెప్పడం కష్టమైన విషయమే. ఇప్పటికే స్టార్ రేంజ్ అందుకున్న వారి నుంచి మీడియం రేంజ్ లో ఉన్నవారు.. చిన్న హీరో స్థాయి వారు.. కాబోయే హీరోలు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంటి వారితో పాటు ఓ హీరోయిన్ కూడా వచ్చేసింది. ఇక రాబోయే కాలంలో కాబోయే హీరోల లిస్ట్ కూడా రెడీగానే ఉంది. మెగా ఫ్యామిలీలో లేటెస్ట్ జనరేషన్ అంతా ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఈ వారసులు అంతా రీసెంట్ గా ఓ ఫ్యామిలీ పార్టీలో కలిశారు. అక్కడ అందరూ కలిసి చాలానే సందడి చేయగా.. రామ్ చరణ్ తీసిన ఓ సెల్ఫీ భలే చూడముచ్చటగా ఉంది.

హీరోయిన్ గా సత్తా చాటేందుకు ట్రై చేస్తున్న నీహారిక.. సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈ సెల్ఫీలో కనిపిస్తారు. రంగస్థలం కోసం గుబురుగా పెంచేసిన గడ్డంతో రామ్ చరణ్ లుక్ సూపర్బ్ గా ఉంటే.. హీరోయిన్ గా మారిన తర్వాత నీహారిక మరింత అందంగా మారిపోయింది. మరోవైపు గతంతో పోల్చితే కాసింత ఒళ్లు చేసిన వైష్ణవ్ తేజ్.. గడ్డం-మీసం పెంచి క్లాస్- మాస్ మిక్స్ చేసిన లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. హీరోయిన్.. కాబోయే మెగా హీరోతో మెగా పవర్ స్టార్ దిగిన ఈ సెల్ఫీ మెగా ఫ్యాన్స్ కు తెగ నచ్చేస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus