మెగాస్టార్ ని ఒక రేంజ్ లో చూపిస్తానంటున్న మెహర్ రమేష్..!

మెగాస్టార్ చిరంజీవిని డైరెక్టర్ మెహర్ రమేష్ ఒక రేంజ్ లో చూపించబోతున్నాడా అంటే నిజమే అంటున్నారు సినీజనం. ఇంతకీ మేటర్ ఏంటంటే, తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన వేదాళం సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు మెహర్ రమేష్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈసినిమాకి లొకేషన్స్ ని వెతికే వేటలో ఉన్నాడట డైరెక్టర్. మెగాస్టార్ సలహాల మేరకు ఈ సినిమాని కోలకత్తా బ్యాక్ డ్రాప్ లో చూపించబోతున్నారట. కథా నేపథ్యాన్ని అక్కడ్నుంచే మొదలు పెడతారని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో కీలకమైన రోల్ లో సాయిపల్లవిని తీస్కుంటున్నారని టాక్. అఫీషియల్ గా ఎలాంటి ఎనౌన్స్ లేకపోయినా కూడా హీరోయిన్ నయనతారని చిరంజీవి సరసన ఫిక్స్ చేసిటనట్లుగానే చెప్తున్నారు. తమిళంలో 2015లో వచ్చిన ఈ సినిమా అక్కడ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కి అజిత్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అందుకే, తెలుగులో కూడా యాక్షన్ సీన్స్ ని కోలకత్తా బ్యాక్ డ్రాప్ లో చేయాలని చూస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

గతంలో చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమా ఇలాగే కొల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో సాగింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా అప్పట్లో కలక్షన్స్ పరంగా మంచి సక్సెస్ ని సాధించింది. అంతేకాదు, మణిశర్మ అందించిన మ్యూజిక్, చిరంజీవి గ్లామర్ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. అందుకే, ఇప్పుడు కూడా కోలకత్తా బ్యాక్ డ్రాప్ లో సాంగ్స్, యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ మెహర్ రమేష్. అందుకోసం ఇప్పట్నుంచే లొకేషన్స్ సెర్చ్ లో ఉన్నాడని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో మెగాస్టార్ ని ఒక రేంజ్ లో చూపించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారట. అదీ మేటర్.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus