మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఆశించిన స్థాయిలో చిరంజీవి పార్టీని నడిపించలేకపోయారు. ఈ పార్టీ విఫలమవ్వడానికి చాలా కారణాలున్నాయి. అప్పట్లో కొన్ని ఛానెల్స్ చిరంజీవికి వ్యతిరేకంగా పనిచేశాయి. చిరు చేసే చిన్న చిన్న పనులను సైతం నెగెటివ్ గా చూపించేవారు. ఓసారి అభిమానులకు కరచాలనం ఇచ్చిన వెంటనే.. చిరు చేతికి శానిటైజర్ రాసుకోవడంతో కొన్ని టీవీ ఛానెల్స్ ఆ దృశ్యంపై బాగా దృష్టి పెట్టారు.
అభిమానులు అంటే అంటరానివాళ్లా..? ఇలాంటి వాళ్లు ప్రజలకు సేవ ఏం చేస్తారంటూ కథనాలు ప్రసారం చేశాయి. దీంతో చిరు అభిమానులు కూడా తమ హీరోని అనుమానంగా చూశారు. ఈ కథనం వెనుక అసలు విషయాలను ఇటీవల చిరు బయటపెట్టారు. ఆరోజు తాను శానిటైజర్ వాడిన మాట నిజమేనని.. అయితే ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా.. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఎవరో ఖర్జూరం అందించారని.. అది తినే ముందు.. చేతుల్ని శానిటైజర్ తో శుభ్రం చేశానని..
అయితే, అదొక్కటి మాత్రమే ఎడిట్ చేసి, అభిమానికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, శానిటైజర్ వాడడం.. మాత్రమే ఫోకస్ చేశారని, అభిమానులు అంటరాన్ని వాళ్లా..? అంటూ పెద్ద హెడ్డింగులు పెట్టారని, ఇది చక్కటి ఎడిటింగ్ నైపుణ్యానికి నిదర్శమని సెటైర్ వేశాడు. ఇదంతా మీడియా మీద కోపంతో కాకుండా.. సరదాగా గుర్తు చేసుకున్నారు మెగాస్టార్. ఆ ఫుటేజీలన్నీ మీడియా హౌస్ లలో భద్రంగానే ఉన్నాయని.. వాటిని బయటకి తీస్తే అసలు నిజాలు బయటపడతాయని చిరు చెప్పుకొచ్చారు.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!