అరుదైన సందర్భం గురించి షేర్ చేసిన ఉపాసన

ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ “‘అజర్ బైజాన్”లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ దాదాపు నెలరోజుల పాటు కొనసాగనుంది. అందుకే అక్కడకు ఉపాసన చేరుకొని చెర్రీకి తోడుగా ఉంటోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సైరా షూటింగ్ కోసం జార్జియాకి వెళ్లారు. సైరా టీమ్ షూటింగ్ ఏర్పాటులో బిజీగా ఉంది. ముందుగా బ్రిటిష్ సైనికులపై సన్నివేశాన్ని సురేందర్ రెడ్డి చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్లో చిరు త్వరలోనే జాయిన్ అవుతున్నారు. ఈ గ్యాప్ లో చిరు.. తన కోడలు ఉపాసన పిలిచిన డేట్ కి హాజరయ్యారు. అది కూడా ఒంటరిగా వెళ్ళలేదు.

సైరా కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న తన కుమార్తె సుష్మిత, అల్లుడుతో కలిసి అజర్‌ బైజాన్‌ కి వచ్చారు. చెర్రీ షూటింగ్‌ సెట్‌లో ప్రత్యక్షమై సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అందరూ కలిసి డిన్నర్‌కి వెళ్లారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. “డిన్నర్‌ డేట్‌ విత్ మావయ్య.. అందరం బ్లాక్‌ డ్రెస్‌కోడ్‌లో ఉన్నాం” అని ట్వీట్‌ చేశారు. ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ ఫోటోకి మెగా అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. తండ్రి కొడుకులు తమ షెడ్యూల్ ని ముగించుకొని ఇండియాకి రావడానికి దాదాపు నెలరోజులు పడుతుంది. చెర్రీ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా… మెగాస్టార్ సినిమా వేసవిలో థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus