మెగాస్టార్ చిరంజీవికి క్యాన్సర్ వచ్చింది అంటూ నిన్నటి నుండి తెగ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అది కూడా గతంలో వచ్చింది అని ఇప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు అందులో పేర్కొంటున్నారు. అయితే అభిమానులు మాత్రం ఆందోళన చెందారు. దీంతో చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇవ్వక తప్పలేదు. చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ… “కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను.
రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని (Chiranjeevi) చెప్పాను. నేను అలర్ట్ గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు.
వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు” అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.