మెగాస్టార్ చేతులెత్తేస్తున్నారా.. షాక్‌లో డైరెక్ట‌ర్లు..?

  • December 2, 2020 / 01:47 PM IST

మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయ‌డం ఏ డైరెక్ట‌ర్‌కి అయినా ఒక క‌ల‌. అలాంటిది బాస్ క‌మ్‌బ్యాక్ అయ్యాక ప‌లువురు డైరెక్ట‌ర్లు ఆయ‌న‌కు క‌థ‌లు వినిపించేందుకు మెగా కాంపౌండ్ త‌లుపు త‌ట్టారు. ఈ క్ర‌మంలో ప‌లువురు డైరెక్ట‌ర్లు కూడా సెట్ అయ్యారు. అయితే ఏమైందో కానీ వారిలో కొంద‌రు మెగా ప్రాజెక్ట్స్ నుండి బ‌య‌ట‌కు వ‌స్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే చిరు హీరోగా తెర‌కెక్కుతున్న‌ మ‌ళ‌యాలం రీమేక్ మూవీ నుండి యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆ త‌ర్వాత మెగా కాంపౌండ్ ఆస్థాన ద‌ర్శ‌కుడు వివి వినాయ‌న్ ఎంట్రీ ఇచ్చినా స్కిప్ట్ విష‌యంలో చిరును సంతృప్తి ప‌ర్చ‌లేకపోవ‌డంతో వినాయ‌కు కూడా ఆ ప్రాజెక్ నుండి అవుట్ అవ‌డంతో, త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ఇన్ అయ్యాడు. ప్ర‌స్తుతం స్కిప్ట్‌లో మార్పుటు చేస్తున్నాడు మోహ‌న్ రాజా. అయితే ఫైన‌ల్‌గా చిరును మెప్పిస్తాడా లేదా అనే డైల‌మా ఉంది. మోహ‌న్ రాజా చేసిన మార్పులు న‌చ్చ‌కుంటే ఈ ప్రాజెక్ట్‌లో మ‌రో డైరెక్ట‌ర్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

ఇక బాబితో కూడా చిరంజీవి సినిమా చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే బాబి చెప్పిన లైన్ న‌చ్చినా, స్కిప్ట్‌లో ప‌లు మార్పులు చెప్పాడటు ఈ మెగా హీరో. అయితే బాబీ చేస్తున్న మార్పులు చిరంజీవిని మాత్రం సంతృప్తిప‌ర్చలేక పోతున్నాయ‌ట‌. దీంతో బాబితో సినిమా కూడా బ్రేక్ ప‌డింద‌ని ఇండస్ట్రీలో ఇన్‌సైడ్ టాక్. చిరు కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నుకున్నా స్క్రిప్ట్ విష‌యంలో తేడా కొట్ట‌డంతో ఆ ద‌ర్శ‌కుల‌కు నో చెబుతున్నాడ‌ట‌.

ఈ మ్యాట‌రే ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రీమేక్ స్కిప్ట్ ల‌ను, చిరంజీవికి న‌చ్చేలా ప‌ర్‌ఫెక్ట్‌గా మార్చ‌డంలో విఫ‌ల‌మ‌వ‌డంతో ఆ డైరెక్ట‌ర్ల‌ని రిజెక్ట్ చేస్తున్నాడ‌ట‌. అంతే కాకుండా బాబి లాంటి డైరెక్ట‌ర్లు చెబుతున్న క‌థ‌ల్లో త‌న‌కు కావాల్సిన బ‌ల‌మైన సామాజిక అంశాలు లేక‌పోడంతో చిరు నో చెక‌బుతున్నాడు. దీంతో చిరంజీవిని డైరెక్ట్ చేసే చాన్స్ రావ‌డంతో ముందు ఎగిరి గంతేసిన డైరెక్ట‌ర్లు ఇప్పుడు చిరంజీవి నిర్ణ‌యంతో షాక్‌కు గుర‌వుతున్నార‌ని టాక్. ప్ర‌స్తుతం ఈమ్యాట‌రే ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిందని సినీ జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus