చిరంజీవి అసలు ప్లాన్ ఇదే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. రీఎంట్రీ ఇచ్చిన చిరుని డైరెక్ట్ చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ముందుకొస్తున్నారు. గతేడాది ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఇప్పుడు ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. చిరు సినిమాలను సొంత బ్యానర్ లో నిర్మించాలని రామ్ చరణ్ భావించారు. అందుకే ‘ఖైదీ నెం.150’, ‘సైరా’ సినిమాలను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే నిర్మించారు.

అయితే ‘సైరా’కి వచ్చిన నష్టాల కారణంగా చిరు సొంత బ్యానర్ అనే ఆలోచన పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బయట బ్యానర్లతో సినిమాలు చేయాలనేది చిరు ప్లాన్. ఈ క్రమంలో వచ్చే ఏడాదిలో మూడు సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. తమిళ ‘వేదాళం’ రీమేక్ లో నటించడానికి మెగాస్టార్ ఓకే చెప్పారు. దసరా నాడు ఈ సినిమా అధికారికంగా ప్రకటించనున్నారు. అనీల్ సుంకర ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేయబోతున్నారు. అయితే ‘ఆచార్య’ సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా మొదలుకానుంది.

అలానే ‘లూసిఫర్’ రీమేక్ కూడా లైన్ లో పెట్టాడు చిరు. వి.వి.వినాయక్ దర్శకతంలో ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరోపక్క దర్శకుడు బాబీ పక్కా స్క్రిప్ట్ తో వస్తే అతడితో కూడా సినిమా చేయాలని భావిస్తున్నాడు చిరు. ఇలా వచ్చే ఏడాదికి గాను మూడు సినిమాలు లైన్లో ఉండేలా చూసుకుంటున్నారు. ఒక్కో సినిమాకి రూ.50 కోట్ల చొప్పున.. మూడు సినిమాలకు మొత్తం రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు చిరు. అంటే ఒక్క ఏడాదిలో చిరు సంపాదన రూ.150 కోట్లన్నమాట.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus