అత్తారింటికి దారేది తమిళ రీమేక్ లో మేఘా ఆకాష్

సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందే హీరోయిన్ కి మరో అవకాశం రావడం అనేది చాలా అరుదైన విషయం. కానీ.. తమిళ కుట్టి మేఘ ఆకాష్ తాను నటించిన మొదటి తమిళ సినిమా షూటింగ్ కూడా పూర్తవ్వకముందే తెలుగులో నితిన్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు సైన్ చేసింది. ఆ సినిమాలు విజయం సాధిస్తే తెలుగులోనే స్థిరపడాలని కూడా భావించింది. కానీ.. ఆమె అదృష్టం కలిసిరాక నితిన్ తో కలిసి నటించిన రెండు సినిమాలు హిట్ అవ్వలేదు.

పైగా.. అమ్మడి పెర్ఫార్మెన్స్ కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఇక్కడ కంటిన్యూ అవ్వాలా లేక తమిళానికి తిరిగి వెళ్లిపోవాలా అనే కన్ఫ్యూజన్ లో కొన్నాళ్లు కొట్టుమిట్టాడిన మేఘ ఆకాష్. త‌న దృష్టిని త‌మిళ రంగంపై పెట్టింది. తాజాగా తమిళంలో అధర్వ జోడీగా “బూమరాంగ్” చేస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, మరో తమిళ సినిమాను అంగీకరించింది. ఇది “అత్తారింటికి దారేది” సినిమాకి రీమేక్. ఈ మూవీకి సుంద‌ర్ దర్శకుడు. “అత్తారింటికి దారేది” మూవీలో ప్ర‌ణ‌తి చేసిన పాత్ర‌క‌కు ఆమెను ఎంపిక చేసిన‌ట్లు టాక్.. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ మొద‌లు కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus