హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న రియల్ స్టార్ తనయుడు?

విలన్ గా .. హీరోగా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరించాడని సమాచారం. పాత్ర ఎటువంటిదైనా తనదైన శైలిలో ఆ పాత్రకు ప్రాణం పొసేవారు శ్రీహరి. అందుకే ఆయన్ని రియల్ స్టార్ అనేవారు. చివరి రోజుల్లో చరణ్, ఎన్టీఆర్, నాగార్జున, శర్వానంద్ వంటి హీరోల చిత్రాల్లో నటించి మెప్పించాడు. ‘కింగ్’ చిత్రంలో తెలంగాణ యాసతో అయన చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇప్పటికి ప్రేక్షకులు ఆ కామెడీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇక ‘మగధీర’ చిత్రంలో ఓ పక్క భారీ స్థాయిలో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే మరోపక్క సహాయ నటుడు గా కూడా అలరించాడు. అటువంటి శ్రీహరి లేని 2013 లో మరణించారు. శ్రీహరి – శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారన్న సంగతి తెలిసిందే.

ఆయన పెద్ద కుమారుడైన మేఘాంశ్ హీరోగా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘రాజ్ దూత్’ అనే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ‘లక్ష్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కార్తీక్ – అర్జున్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చాలా వరకూ పూర్తయ్యింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus