మెహ‌బూబ్ కామెంట్స్ పై అరియానా ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఏంటో..?

  • November 19, 2020 / 12:07 PM IST

తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ మొద‌లై 74వ రోజుకు చేరుకుని స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. హౌస్‌లో కంటెస్టెంట్స్ చేసే అల్ల‌రి, కొంద‌రి అల‌క‌లు, ముఖ్యంగా గొడ‌వ‌లు, అలాగే ఎలిమినేష‌న్స్‌ ఇలా బిగ్‌బాస్ తాజా సీజ‌న్ ఎంట‌ర్‌టైనింగ్ గానే సాగుతోంది. బిబి హౌస్‌లో 16 మంది కంటెస్టెంట్ల‌తో పాటు ముగ్గ‌రు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌ద‌కొండో వారానికి వ‌చ్చేస‌రికి బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్ర‌మే మిగిలారు.

ప్ర‌స్తుతం నాల్గో సీజ‌న్ బిబి ట్రోఫీసం అఖిల్ అభిజిత్, అవినాష్, అరియానా, హారిక‌, సోహైల్‌, మోనాల్‌, లాస్యలు ఎవ‌రికి వారు టైటిల్ సొంతం చేసేందుకు పోటా పోటీగా పోరాడుతున్నారు. ఫుల్ ఎఫ‌ర్ట్స్‌తో టాస్కుల్లో పాల్గొంటూ, ఎమోష‌న్స్‌ను కంట్రోల్ చేసుకుంటూ, రోజురోజుకీ త‌మ త‌మ గ్రాఫ్ పెంచుకుంటూ బిగ్‌బాస్ విన్న‌ర్ అయ్యేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ఫినాలేకు చేరుకునేది మాత్రం ఐదుగురే.. బిగ్‌బాస్ బాస్ టైటిల్ కొట్టే ఒక్క‌రే.

ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వ‌స్తే.. లాస్ట్ వీక్ మెహ‌బూబ్ బిబి హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో అత్యంత ఎమోష‌న‌ల్ ఎలిమినేష‌న్ మెహ‌బూబ్‌దే అని చెప్పాలి. హౌస్‌లో ఉన్న ప్ర‌తిఒక్క‌రు క‌న్నీళ్ళు పెట్టారు. చాలా భారంగా సాగిన ఆ మూమెంట్, ప్ర‌తి ఒక్క‌రు ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసింది. ఇక‌ ఆ సిట్యువేష‌న్ నుండి హౌస్‌మేట్స్ తేరుకోవ‌డాని టైమ్ ప‌ట్టినా, ఆ త‌ర్వాత య‌ధావిధిగా కంటెస్టెంట్స్ హౌస్‌లో త‌మ జ‌ర్నీని సాగిస్తున్నారు.

మ‌రోవైపు ఎలిమినేష‌న్ అయిన మెహ‌బూబ్ తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో ప్ర‌స్తుతం హౌస్‌లో ఉన్న వారి పై చేసిన వ్యాఖ్య‌లు ఆశ‌క్తిక‌రంగా ఉన్నాయి. ముఖ్యంగా అరియాన పై కామెంట్స్ షాకింగ్‌గా ఉన్నాయి. అరియాన టాస్కుల్లో ఫుల్ ఎఫ‌ర్ట్స్ పెడుతోంద‌ని, సిట్యువేష‌న్ ఏదైనా గివ్అప్ ఇవ్వ‌ద‌న్న మెహ‌బూబ్, ఆమెకు ఉన్న ఇగోనే నెగిటివ్ అన్నాడు. సైకిల్ స్టాండ్ టాస్క్‌లో కొంచెం ఎక్కువే చేసింద‌ని.. మోన‌ల్ పై ప‌ర్స‌న‌ల్ టార్గెట్ ఏం లేదు కానీ, హార్ట్‌తో ఆలోచించ‌కుండా ఇచ్చిన టాస్క్‌ను మించి ఎక్కువ‌గానే చేసింద‌న్నాడు. అక్క‌డ గ్రాస్‌, ఫోమ్‌, మట్టి ఉన్నా, ఐస్ వాట‌ర్ కొట్ట‌డం క‌రెక్ట్ కాద‌ని అరియాన పై మెహ‌బూబ్ కామెంట్స్ చేశాడు. మ‌రి మెహ‌బూబ్ కామెంట్స్ పై అరియాన ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus