మూడేళ్ళ క్రితం “కృష్ణగాడి వీరప్రేమ గాధ” చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన మెహరీన్ ఈ మూడేళ్లలో “ఎఫ్ 2” మినహా మరో కమర్షియల్ హిట్ అందుకోలేకపోవడమే కాదు.. నటిగానూ తనను తాను నిరూపించుకోలేకపోయింది. దాంతో కొన్ని సినిమాల్లో సెకండ్ లీడ్ లేదా అంతకంటే తక్కువ ప్రిఫరెన్స్ ఉన్న రోల్స్ కూడా చేసింది మెహరీన్. కాకపోతే.. వరుసబెట్టి సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వస్తుండడం వలన ఆమెను ఐరన్ లెగ్ అని అభివర్ణించడం కూడా మొదలెట్టారు. కానీ.. ఎట్టకేలకు “ఎఫ్ 2″తో మంచి హిట్ అందుకొని తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ కు గట్టి సమాధానం ఇచ్చింది మెహరీన్.
నిజానికి మెహరీన్ బ్యాడ్ యాక్టర్ ఏమీ కాదు. “కృష్ణగాడి వీరప్రేమగాధ”లో ఆమె నటన చూసి ఫిదా అవ్వని కుర్రాడు లేడు. కాకపోతే.. ఆ తర్వాత దర్శకులు ఆమె నటనను కాకుండా అందాలను మాత్రమే ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించి ఆమెపై నెగిటివ్ కామెంట్స్ రావడానికి ముఖ్యకారకులయ్యారు. అమ్మడు కూడా మధ్యలో సినిమాల్లేక ఎక్కువ ఖాళీగా ఉండడంతో లావైపోయింది. లావవ్వడం, సినిమాల్లేకపోవడం, ఉన్న సినిమాల్లో ఆమె నటనకు నెగిటివ్ కామెంట్స్ రావడంతో.. “తెల్లతోలు ఉన్న డెడ్ ఫేస్ మెహరీన్” అనే కామెంట్స్ కాస్త ఘాటుగా వినిపించాయి. ఇదే విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడిని కూడా అడిగేశారు కొంతమంది. అతను మాత్రం చాలా ఓపిగ్గా మెహరీన్ మంచి నటి కూడా.. కాకపోతే ఆ నటిని ఎవరూ సరిగ్గా వాడుకోవడం లేదని వివరణ ఇచ్చాడు. మరి ఇకనైనా సరైన నిర్ణయాలతో మెహరీన్ తన కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటుందో లేదో చూడాలి.