నా భార్య గాసిప్స్ ని పట్టించుకోదు.. రానా కామెంట్స్!

టాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రానా దగ్గుబాటి. ఇటీవలే రానా తను ప్రేమించిన మిహీకా బజాజ్ ను వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో అతి తక్కువ మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు రానాకి ఎఫైర్లు ఉన్నాయంటూ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. ప్రముఖ నటి త్రిషతో రానా సన్నిహితంగా మెలగడం, వీరిద్దరికి సంబంధించిన కొన్ని క్లోజ్ ఫోటోలు బయటకి రావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఆ తరువాత రకుల్ ప్రీత్ సింగ్ తో రానాకి లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. ఇలా తన ఎఫైర్ల గురించి మీడియాలో వచ్చిన వార్తలపై మిహీకా ఎలా రియాక్ట్ అయిందని ఇటీవల రానాని ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు. తనపై మీడియాలో చాలా రూమర్లు వినిపించేవని.. అవి అందరికీ తెలుసునని.. మిహీకాకు కూడా వాటి గురించి తెలుసని అన్నారు. ఆమె ముంబై, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పెరిగిందని.. ఇలాంటి రిలేషన్షిప్ ల గురించి ఆమెకి పూర్తి అవగాహన ఉందని అన్నారు.

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ వారికి ఇలాంటి విషయాలపై చాలా క్లారిటీ ఉంటుందని.. తనపై వచ్చిన గాసిప్ ల విషయంలో మిహీకా ఎలాంటి ఆందోళనా చెందలేదని క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్యంపై కూడా మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయని.. వాటి గురించి కూడా మిహీకా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

 

బజాజ్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus