‘బేషారం రంగ్’ పాటను డర్టీ మైండ్ తో చిత్రీకరించారు అంటూ ‘పఠాన్’ టీంకి మంత్రి వార్ణింగ్ !

షారుఖ్ ఖాన్ నుండి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ ‘ప‌ఠాన్‌’. ‘వార్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది అని టీజర్ తో చెప్పకనే చెప్పారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం నుండి ‘బేషారం రంగ్’ పేరుతో ఓ పాట రిలీజ్ అయ్యింది. విశాల్, శేఖర్.. సంగీతంలో రూపొందిన ఈ పాటలో లిరిక్స్ వంటివి ఎలా ఉన్నా…ఎక్కువ శాతం హైలెట్ అయ్యింది హీరోయిన్ దీపికా ప‌దుకొనే అనే చెప్పాలి.

మునుపెన్నడూ లేని విధంగా ఆమె ఈ పాటకు ఓ రేంజిలో ఎక్స్‌పోజింగ్ చేసింది. దీపికా గ్లామర్ షో చేయడం అనేది కొత్తేమీ కాదు. కానీ.. ఈ పాట‌లో ఆమె ఎక్స్పోజింగ్ టాప్ నాచ్ లో ఉంది. ఆమె పలికించిన హావ‌భావాలు, అందాల‌ను ప్ర‌ద‌ర్శించిన తీరు కూడా వేరే లెవెల్ లో ఉంది. షారుఖ్ ఈమె గురువు కాబట్టి.. ఇంతలా నటించి ఉండొచ్చు అని కొందరు అనుకుంటుంటే.. పెళ్ళయ్యాక ఆఫర్లు తక్కువవ్వడం వల్ల ఆమె ఇలా చేసి ఉండొచ్చు అంటూ అభిప్రాయపడుతున్నారు.

ఈ పాట గురించి రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. అయితే ఈ పాట గురించి.. దీపికా వస్త్రధారణ గురించి మధ్యప్రదేశ్ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా షాకింగ్ కామెంట్లు చేసింది.’ ‘బేషారం రంగ్’ పాటలో హీరోయిన్ దీపిక వ‌స్త్రధార‌ణ ఏమాత్రం బాలేదు. ఒక డ‌ర్టీ మైండ్‌సెట్‌తో ఈ పాట‌ను చిత్రీక‌రించారు.ఈ పాట‌లోని క్లిప్పింగ్స్, దీపిక డ్రెస్సింగ్‌, వంటివి క‌రెక్ట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

అలా చేయకపోతే ‘ప‌ఠాన్’ సినిమాను మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌లో రిలీజ్ చేయనివ్వం అంటూ హెచ్చరించారు న‌రోత్త‌మ్ మిశ్రా. మిశ్రా కామెంట్ల పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘మంత్రులు సెన్సార్ బోర్డులో కూడా భాగం అయ్యారా?.. హీరోయిన్లు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే మీకెందుకు?’ అంటూ మండిపడుతున్నారు.ఇక ‘పఠాన్’ మూవీ జనవరి 25న విడుదల కాబోతుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus