Liger Movie: ‘లైగర్’ కి డిజాస్టర్ టాక్ రావడానికి 10 కారణాలు..!

  • August 25, 2022 / 07:43 PM IST

విజయ్ దేవరకొండ యూత్ లో భీభత్సమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరో. అతని గత రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ ఓపెనింగ్స్ మాత్రం ఇరక్కొట్టేశాయి. ఇక్కడ ఓపెనింగ్స్ బాగా వస్తున్నాయి అంటే కచ్చితంగా ఇతను స్టార్ స్టేటస్ ను అందుకోవడానికి చాలా దగ్గర్లో ఉన్నాడని అర్ధం. సరైన హిట్లు రెండు, మూడు పడితే ఇతను ఇప్పటికే స్టార్ హీరో అయిపోయేవాడు. ఇక చాలా మంది హీరోలకు స్టార్ ఇమేజ్ ను తెప్పించడంలో సక్సెస్ అయిన దర్శకుడు పూరి జగన్నాథ్. వరుస ప్లాపుల్లో ఉన్నప్పటికీ ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి తన ఇమేజ్ ఏమాత్రం పడిపోలేదు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి స్టార్ డైరెక్టర్.. స్టార్ స్టేటస్ కు దగ్గర్లో ఉన్న ఉన్న విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. ‘లైగర్’ విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ లుక్ నుండే భారీ హైప్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ… ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ వంటి వాటితో తారా స్థాయికి చేరుకుంది అనే చెప్పాలి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుండా అంటే… సందేహపడకుండా నో అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ‘లైగర్’ సినిమాకి ప్రధానంగా ఇంత హైప్ ఏర్పడడానికి కారణం హీరో విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ కు ఉన్న ప్లస్ పాయింట్ ప్రతి ఒక్క సెక్షన్ కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ను ఆ హీరోతో చెప్పించడం. ఈ సినిమాకి వచ్చేసరికి హీరోకి నత్తి అనే ఎలిమెంట్ ను పెట్టేసి.. ఆ బలాన్ని కట్టిపడేసాడు. కాబట్టి పూరి సినిమా నుండి ఏమైతే ఆశించి ప్రేక్షకుడు థియేటర్ కు వస్తాడో.. ఇక్కడ అదే కరువయ్యింది.

2) కథ పరంగా ఈ సినిమా ఏమాత్రం కొత్తగా లేదు. పూరి సినిమాల్లో కథని ఆశించడం కూడా తప్పే అవుతుంది. అతని సినిమాలు చాలా వరకు హీరో క్యారెక్టరైజేషన్ పైనే వెళ్తుంటాయి. ‘లైగర్’ కథ చాలా సినిమాల్లో చూసిందే. పూరి ఈ సినిమాని తీశాడు కాబట్టి.. అతని గతంలో ఇలాంటి కథతో తీసిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా ఎక్కువగా గుర్తుకొస్తుంది. ఆ సినిమాని హిందీ ఆడియన్స్ కు తగ్గట్టు రీమేక్ చేసి.. తెలుగులో డబ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ ‘లైగర్’ కూడా అలా అనిపిస్తుంది.

3) పూరి సినిమాల్లో మంచి మ్యూజిక్ ఉంటుంది. ఈ సినిమాలో రెండు పాటలు బాగున్నాయి. కానీ వాటి ప్లేస్మెంట్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఆ పాటలు కూడా జనాలకు గుర్తుంచుకునే విధంగా ఉండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఘోరంగా ఉంది. ఈ విషయంలో ‘ఇస్మార్ట్ శంకర్’ రేంజ్ ఔట్పుట్ ఆశించారు ప్రేక్షకులు. కానీ దానికి, దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.

4) హీరోయిన్ అనన్య పాండే ట్రాక్ చాలా వీక్ గా ఉంది. కథని ఎక్కడికో తీసుకెళ్ళాలి అనే ట్రాన్స్ లో ఈ పాత్రని డిజైన్ చేసుకున్నట్టు ఉంది తప్ప.. సినిమాకి ఏమాత్రం ప్లస్ అవ్వలేదు.

5) హీరోకి నత్తి అనే ఎలిమెంట్ ఎందుకు పెట్టాడో అనేది అస్సలు అర్ధం కాని ప్రశ్న. ‘ఇద్దరమ్మాయిలతో’ టైంలో అల్లు అర్జున్ ఓ మాట అంటే ఈ ‘లైగర్’ పాయింట్ రాసేసుకున్నాడట. ఏదో హైప్ కోసం చెప్పుకోవడం తప్ప.. అది ఈ కథకి అవసరం లేదు.

6) రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుంది అని ముందు నుండి అంతా అనుకున్నారు. కానీ ఆమెతో ఓవరాక్షన్ చేయించాడు పూరి అని అడుగడుగునా అనిపిస్తుంది.

7) సినిమాలో లెక్కలేనంత క్యాస్టింగ్ ఉంది. కానీ దేనిని కూడా పూర్తి స్థాయిలో దర్శకుడు వాడినట్టు అనిపించదు.

8) ఈ సినిమాలో విలన్ లేకపోవడం కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి. పూరి సినిమా అంటే హీరోలకు ధీటుగా విలన్లు ఉంటారు. వారి మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఇందులో అలాంటివేమీ లేవు.

9) మైక్ టైసన్.. ఇతన్ని ఈ సినిమాలో పెట్టారు. ప్రమోషన్ కోసం కూడా ఇతని పేరుని పదే పదే వాడుకున్నారు. కానీ అన్ని సెక్షన్ల ఆడియన్స్ కు ఇతని పాత్ర చూసిన తర్వాత కలిగే ప్రశ్న ఒక్కటే.. ‘టైసన్ ను పెట్టాల్సిన అవసరం ఏముంది’ అని..! అది దర్శకుడికే తెలియాలి.

10) పూరి సినిమాల్లో ఇది భారీ బడ్జెట్ మూవీ అన్నారు. ఒక్క బాక్సింగ్ రింగ్ లు తప్ప.. అంత భారీగా కనిపించిన విజువల్స్ ఏమీ లేవు ఈ సినిమాలో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus