అశ్లీ క్రియేషన్స్ బ్యానర్ పై జయ్ వల్లందాస్ నిర్మాణంలో రూపొందిన వైవిధ్యమైన చిత్రం ‘మిస్టీరియస్. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా.. ‘సరికొత్త స్క్రీన్ ప్లే తో అడుగడుగునా సస్పెన్స్ ఎలిమెంట్స్ ను జోడించి ఈ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించాం. ప్రేక్షకులకు ఆద్యంతం ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది ఈ సినిమా’ అంటూ దర్శకులు మహి కోమటి రెడ్డి చెప్పుకొచ్చారు.
అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్టు కూడా ఆయన తెలిపారు. అలాగే సెన్సార్ వారు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్టు కూడా స్పష్టం చేశారు.అలాగే సహా నిర్మాతలు ఉషా, శివానీ మాట్లాడుతూ….’మిస్టీరియస్’ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. టీజర్ కి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుండటం సంతోషాన్ని ఇస్తుంది.
రోహిత్, మేఘన రాజ్ పుత్ తో పాటు.. అభిద్ భూషణ్, రియా కపూర్, కన్నడ నటుడు బాలరాజ్ వాడి, శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆకునూరి గౌతమ్, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ నవీన్ మరియు లక్కీ మొదలగు వారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎల్.రాజా సంగీతం అందించగా పరవస్తు దేవేంద్ర సూరి(దేవా) సినిమాటోగ్రాఫర్ గా అలాగే ఎడిటర్ గా వ్యవహరించారు.