ప్రియదర్శి హీరోగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ ఎం హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘మిత్రమండలి’ (Mithra Mandali). ప్రసాద్ బెహరా, విష్ణు ఓఐ, రాగ్ మయూర్ ,కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్ వంటి వాళ్ళు కూడా కీలక పాత్రలు పోషించారు. బన్నీ వాస్ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు.
దీపావళి రేసులో అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. దీంతో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కావడం లేదు. కనీసం దీపావళి సెలవులు కూడా ‘మిత్ర మండలి’ వాడుకోలేకపోతుంది.
ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.30 cr |
సీడెడ్ | 0.10 cr |
ఆంధ్ర(టోటల్) | 0.21 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.61 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.11 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 0.72 కోట్లు(షేర్) |
‘మిత్రమండలి’ (Mithra Mandali) చిత్రానికి రూ.5.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమాకి కేవలం రూ.0.72 కోట్లు షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా కేవలం రూ.1.12 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.28 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం చాలా టార్గెట్ ను రాబట్టాలి. కానీ ఇప్పుడు వచ్చిన ఓపెనింగ్స్ తో ఆ ఫీట్ సాధించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.