సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. లేటెస్ట్ గా ప్రపంచవ్యాప్తంగా ‘మిస్టర్ బీన్’గా గుర్తింపు పొందిన బ్రిటిష్ నటుడు రోవన్ అట్కిన్సన్‌తో మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా డేటింగ్ చేస్తోందనే వార్త ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. వీరిద్దరూ కలిసి ఫ్రాన్స్‌లో విహరిస్తున్నారంటూ కొన్ని ఫోటోలు బయటకు రావడంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. అయితే ఈ ప్రచారంపై మియా ఖలీఫా తాజాగా స్పందిస్తూ అసలు నిజం బయటపెట్టారు.
నిజానికి వైరల్ అయిన ఆ ఫోటోల వెనుక ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మ్యాజిక్. ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ సరదాగా ఏఐ సాయంతో వీరిద్దరూ కలిసి ఉన్నట్లు చిత్రాలను సృష్టించి, “మిస్టర్ బీన్ తన హీరోయిన్‌ను కనుగొన్నాడు” అని క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫోటోలు అచ్చం నిజమైన వాటిలా ఉండటంతో చాలా మంది వాటిని గుడ్డిగా నమ్మేసి షేర్ చేసేశారు. ఇది కాస్తా ముదిరి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లెవల్‌లో డేటింగ్ రూమర్‌గా మారిపోయింది.
ఈ పుకార్లపై మియా ఖలీఫా తనదైన శైలిలో స్పందించారు. తాను ప్రస్తుతం ఒక ‘మూర్ఖుడితో’ డేటింగ్ చేస్తున్నానని, కానీ అది కచ్చితంగా మిస్టర్ బీన్ మాత్రం కాదని ఆమె తేల్చి చెప్పారు. అంతేకాదు, ఆ డేటింగ్ వార్తలను ఖండించిన ఒక పోస్ట్‌ను రీ-షేర్ చేస్తూ, మిస్టర్ బీన్ లాంటి వ్యక్తితో డేటింగ్ అనే ప్రతిపాదనపై తనకు అభ్యంతరం లేదన్నట్లుగా జోక్ చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ క్రేజీ డిస్కషన్‌కు చెక్ పడింది.
వాస్తవానికి వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాల్లో ఎవరి దారిలో వారు బిజీగా ఉన్నారు. రోవన్ అట్కిన్సన్ 2013 నుండి నటి లూయిస్ ఫోర్డ్‌తో సహజీవనంలో ఉన్నారు, వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. మియా ఖలీఫా కూడా ప్రస్తుతం మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది, కానీ ఆ వివరాలను ఆమె రహస్యంగా ఉంచారు. ఏది ఏమైనా, ఏఐ సృష్టించిన ఫోటోలు ఎంతటి గందరగోళానికి దారితీస్తాయో ఈ ఇన్సిడెంట్ క్లియర్‌గా చూపిస్తోంది.