టాప్ సింగర్ కి గట్టి పంచ్ పడింది

ఒకప్పుడు సింగర్స్ కి ఏళ్ల తరబడి ఒకే రెమ్యునరేషన్ ఉండేది. ఒక్కోసారి కొన్ని రాకపోవచ్చు కూడా. అయితే ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదు. కొన్ని సినిమాలకు మ్యూజిక్ చాలా అవసరం కావడంతో సింగర్స్ కి డిమాండ్ చాలా పెరిగిపోతోంది. కొందరు స్టార్ సింగర్స్ అయితే కనీసం ఒక్కోసారి కాల్షీట్స్ ఇవ్వలేని పరిస్థితి. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఈ మధ్య కాలంలో ఒక్క పాటతో పాపులర్ అయితే చాలు రేట్ చాలా పెంచేస్తున్నారు. ఆ తరహాలో అతి తక్కువ కాలంలో రెమ్యునరేషన్ లో అందరిని దాటేసిన గాయని శ్రేయ ఘోషల్. ఆమె ఒక్క పాట పాడితే చాలు సినిమా రేంజ్ పెరుగుతుందని నిర్మాతలు ఎంతైనా భరిస్తారు.

ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి శ్రేయ ఘోషల్ పై ఒక సెటైర్ వేశారని సోషల్ మీడియాలో టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆయన పెట్టిన ఒక్క కామెంట్ వల్ల అదే హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఈ మధ్య థమన్ సోదరి యామిని కీరవాణి కంపోజ్ చేసిన ఒక పాటని చాలా స్వీట్ గా ఆలపించింది. దీంతో కీరవాణి వెంటనే.. పేదవాడి శ్రేయ అని కామెంట్ చేశారు. అంటే శ్రేయ ఘోషల్ రేంజ్ ఏ స్థాయిలో ఉందొ మనం అర్ధం చేసుకోవచ్చని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి కీరవాణి యామిని ని పొగిడినట్టే పొగిడి మరోవైపు టాప్ గాయనికి ఒక కౌంటర్ వేశాడని చెప్పవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus