Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను హీరోగా రూపొందిన ‘పెద్ది'(Peddi) సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్‌కి చేరాయి.

Peddi

టీజర్, ట్రైలర్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. సాధారణంగా జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు సినిమాల గురించి మాట్లాడటం చాలా అరుదు.

కానీ ‘పెద్ది’ క్రేజ్ చూసి ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీనే ఈ సినిమా గురించి ఆరా తీయడం ఇప్పుడు నేషనల్ వైడ్‌గా చర్చినీయాంశమైంది.రీసెంట్‌గా ఢిల్లీలో జరిగిన ప్రెస్‌మీట్‌లో రామ్ చరణ్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘గతంలో నేను ప్రధాని మోదీ గారిని కలిసినప్పుడు.. ‘పెద్ది’ సినిమా స్టోరీ దేని గురించి అని అడిగారు.

‘ఇది అభివృద్ధి చెందుతున్న భారతదేశం, అలాగే మన పల్లెటూళ్ల సాధికారత నేపథ్యంలో సాగే కథ అని ఆయనకు వివరించాను’ అని చరణ్ తెలిపారు.చరణ్ చేసిన ఈ కామెంట్స్‌ను బీజేపీ పార్టీ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేయడం విశేషం. దీన్నిబట్టి ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

జూన్ 4న ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలోని పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం చరణ్ తన రక్తం చిందించి, ప్రాణం పెట్టి పని చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈరోజు చెన్నైలో మీడియాతో ముచ్చటించనున్న ఈ హీరో.. జూన్ 1న విజయవాడలో జరిగే భారీ ఈవెంట్‌లో పాల్గొంటారు.

ఆ తర్వాత హైదరాబాద్‌లో మెగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.వీటితో పాటు ఆయా నగరాల్లో లోకల్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు.

‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus