‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ రేంజ్ బాగా పెరిగింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.125 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లోనూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే.
ఏకంగా అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’కు పోటీగా రిలీజై, ఆ సినిమా కలెక్షన్లనే దెబ్బకొట్టడంతో నిఖిల్ పేరు ఇండియా వైడ్ మార్మోగింది.
అయితే ఆ సినిమా తర్వాత నిఖిల్ నటించిన ’18 పేజెస్’ కొంతవరకు పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ‘స్పై’ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాలు ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా డిజాస్టర్లు అయ్యాయి. వీటి ప్రభావం ఇప్పుడు నిఖిల్ నెక్స్ట్ మూవీ బిజినెస్‌పై పడుతుంది అని అంతా అనుకున్నారు. కానీ నిఖిల్ నెక్స్ట్ మూవీ ‘స్వయంభూ'(Swayambhu) పై అలాంటి ప్రభావం ఏమీ పడలేదు. ఇదొక పాన్ ఇండియా సినిమా. నిఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో భువన్ సాగర్, శ్రీకర్ బసిరెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరించారు.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు పర్వాలేదనే రెస్పాన్స్ వచ్చింది.కానీ ఓటీటీ బిజినెస్ గురించి రకరాల రూమర్స్ వినిపిస్తున్నాయి. కేవలం ఓటీటీ బిజినెస్ క్లోజ్ కాకపోవడం వల్లే ‘స్వయంభూ’ రిలీజ్ ఆలస్యమవుతోందని కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం, ‘వీఎఫ్ఎక్స్ వర్క్ వల్లే సినిమా ఆలస్యం అవుతుందని’ క్లారిటీ ఇచ్చారు.
ఆ విషయాలు పక్కన పెడితే.. ‘స్వయంభూ’ ఓటీటీ బిజినెస్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుండి ఒక క్రేజీ డీల్ వచ్చినట్లు సమాచారం. అదేంటంటే.. ‘స్వయంభూ’ చిత్రం థియేట్రికల్‌గా ఎంత షేర్ రాబడితే, అందులో సగం మొత్తాన్ని డిజిటల్ రైట్స్ రూపంలో నెట్‌ఫ్లిక్స్ వారు చెల్లిస్తారట.అంటే ‘స్వయంభూ’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల షేర్ సాధిస్తే.. నెట్‌ఫ్లిక్స్ వారు డిజిటల్ రైట్స్ రూపంలో రూ.25 కోట్లు చెల్లిస్తారన్నమాట!
ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏ తెలుగు సినిమాకూ ఇలాంటి డీల్ ఆఫర్ చేసింది లేదు. కేవలం ‘స్వయంభూ’ చిత్రం కంటెంట్ పై ఉన్న నమ్మకం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.